Health

ప‌ర‌గ‌డుపునే కొబ్బ‌రి నీళ్ల‌ను తాగితే ఎంత మంచిదో తెలుసుకోండి.

సెలాయిన్స్‌‌లో ఉండే సమానమైన మినరల్స్ కొబ్బరినీళ్లలో ఉంటాయి. కాబట్టి ఈ కొబ్బరినీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అలసిన శరీరానికి తిరిగి ఉత్తేజం ఇచ్చినట్లువుతుందని చెబుతున్నారు. కొబ్బరి నీళ్లల్లో ప్రోటీన్స్, కొవ్వు, పిండిపదార్థాలు, డైటరీ ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. గ్లాసు కొబ్బరినీళ్లల్లో 2 టీస్పూన్స్ నిమ్మరసం వేసి కలిపి తాగడం వల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ సమతుల్యమవుతాయి.

అయితే కొబ్బరి నీళ్లలో అనేక పోషకాలు ఉంటాయి. వీటిలో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల బీపీ కంట్రోల్ లో ఉంటుంది. కొబ్బరి నీళ్లలో ఉండే ప్రోటీన్స్, కొవ్వు , పిండిపదార్థాలు, ఫైబర్, కాల్షియంలు అదనంగా ప్రయోజనం చేకూరుతాయి. ఈ నీళ్లలో కొంచెం నిమ్మరం వేసుకొని తాగడం వల్ల శరీరంలోని ఎలక్ట్రోరల్స్ సమతుల్యమవుతాయి. దీంతో ప్రత్యేకంగా గ్లూకోస్ కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు.

గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు వీటిని తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. వేసవిలోనే కాకుండా అన్ని కాలాల్లో కొబ్బరి నీళ్లు అందుబాటులో ఉంటున్నాయి. అందువల్ల వీలు దొరికినప్పుడల్లా వీటిని తీసుకోవడం మంచిదే. అయితే కొందరు ఉదయాన్నే కొబ్బరినీళ్లు తీసుకోవడం మరీ మంచిదని అంటున్నారు. ఉదయం కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతంది.

పొద్దున్నేదీనిని తీసుకోవడం వల్ల రోజంతా యాక్టివ్ గా ఉంటారు. ఇవి తాగి బయటకు వెళ్లడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్, ఇతర రసాయనాలు బయటకు వెళ్లిపోతాయి. కేవలం శరీరంలోని అవయవాలను సక్రమంగా పనిచేయడమే కాకుండా చర్మం కాంతివంతంగా మెరవడానికి కూడా కొబ్బరి నీళ్లు పనిచేస్తాయి. ఇవి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గి స్లిమ్ గా ఉండే అవకాశం ఉంటుంది.

ఇవి జీర్ణావస్థను సెట్ చేస్తుంది కాబట్టి ఎలాంటి బరువు పెరుగరు. అందువల్ల సాధ్యమైనంత వరకు కొబ్బరినీళ్లు తీసుకోవడం మంచిదేనని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker