లవంగ నూనె పురుషులకు వరం, ఆ విషయంలో రెచ్చిపోవచ్చు.
రుచి కోసం కూరలలో వేసుకునే ఈ లవంగాలలో సువాసనే కాదు విలువైన పోషకాలు కూడా ఉన్నాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు. చాలా మంది దీనిని శాఖాహార , మాంసాహార వంటకాల్లో విరివిగా ఉపయోగిస్తారు. లవంగాల నుండి తయారు చేసే నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే లవంగాలను ఆహారంలో చేర్చుకుంటే.. జీర్ణశక్తి పెరుగుతుంది. డయాబెటిస్‌ను కూడా అదుపుచేస్తుంది. ఇవి మాత్రమే కాదు.. దీనితో ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా పురుషులలైంగిక సమస్యలను పరిష్కరించడంలో బాగా పనిచేస్తుంది.
పురుషుల శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచడంలో లవంగం నూనె సహాయపడుతుంది. వీర్యకణాల సంఖ్యను పెంచడంతో పాటు శీఘ్ర స్కలన సమస్యలను తగ్గిస్తుంది. లవంగం నూనెతో పురుషులకు ప్రయోజనాలు.. లవంగ నూనెను వాడడం వల్ల పురుషుల్లో లైంగిక సమస్యలు తొలగిపోతాయి. శృంగార జీవితాన్ని మెరుగుపరచడంలో లవంగం నూనె బాగా ఉపయోగపడుతుంది. లవంగం ఎసెన్షియల్ ఆయిల్‌ను ఉపయోగించడం వల్ల వంధ్యత్వ సమస్యలను చాలా వరకు అధిగమించవచ్చు. ఇది పురుషుల శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. లిబిడోను పెంచడానికి కూడా పనిచేస్తుంది. అంతేకాదు స్పెర్మ్ కౌంట్ పెరుగుతంది.
సంతానోత్పత్తిలో ఎలాంటి సమస్యలున్నా వాటిని లవంగ నూనె పరిష్కరిస్తుంది. లవంగం నూనెలో అనేక విటమిన్లు, ఫ్లేవనాయిడ్లు, ఆల్కలాయిడ్స్, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు ఉంటాయి. ఇవి వీర్య కణాల సంఖ్యను పెంచడంలో సహాయపడతాయి. ఇది శుక్రకణాల మొటిలిటీ (చలనం) మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. లవంగం ఎసెన్షియల్ ఆయిల్ అరోమాథెరపీతో ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. ధూమపానంవ్యసనం నుండి బయటపడటానికి కూడా చాలా సహాయపడుతుంది. లవంగం నూనెను రెగ్యులర్ హీట్ బాత్‌గా తీసుకుంటే.. అది మీ మనస్సును ప్రశాంతపరుస్తుంది. పొగతాగే కోరికను తగ్గిస్తుంది. తద్వారా సిగరెట్లను మానేయవచ్చు. లవంగం నూనె వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది.
తద్వారా శరీరంలో ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు తొలగిపోతాయి. లవంగం నూనె శరీరంలో శక్తిని, నాడీ ఉత్సాహాన్ని పెంచుతుంది. దీని వల్ల శీఘ్ర స్కలనం సమస్య తగ్గుతుంది. ఎక్కువ సేపు శృంగారాన్ని ఆస్వాదించవచ్చు. లవంగం మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. ఇది డయాబెటిస్‌ను కంట్రోల్ చేస్తుంది. రక్తంలో చక్కెర మొత్తాన్ని పెరగకుండా సాయం చేస్తుంది. లవంగం రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కూడా దోహదపడుతుంది. ఇది వైరస్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. తద్వారా పలు రకాల వైరల్ ఇన్‌ఫెక్షన్‌ల బారినపడకుండా మనల్ని కాపాడుతుంది.