Health

ఈ కాలంలో ఫ్రిజ్ వాటర్ కాకుండా మట్టి కుండలో నీరు తాగితే ఎన్ని లాభాలో తెలుసుకోండి.

మారిన జీవన శైలీతో.. స్టీల్, ప్లాసిక్, పింగాణి పాత్రలు వచ్చేశాయి. ఇక మట్టి కుండలను కూడా వాడడం మార్చిపోయారు నేటితరం. ఫ్రిజ్‌లు వచ్చాక.. వీటిని పక్కన పెట్టేశారు. పూర్వకాలంలో నీళ్ళను ఈ మట్టి కుండలలోనే స్టోర్ చేసి తాగేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఎండాకాలం వచ్చిదంటే ఓన్లీ ఫ్రిజ్ వాటర్. అలా కూల్ వాటర్ తాగడం వల్ల వెంటనే చాలా హాయిగా అనిపిస్తుంది కానీ.. కొంతకాలం తర్వాత అనారోగ్య సమస్యలు వెంటాడే అవకాశాలున్నాయి.

రిఫ్రిజిరేటర్ లోని చల్లటి నీరు తాగడం వల్ల అకస్మాత్తుగా గొంతు కణాల ఉష్ణోగ్రత పడిపోతుంది, గొంతు నొప్పితో పాటు జలుబు చేసే అవకాశం ఉంది. మట్టి కుండలో నీళ్ళను తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా మంది మట్టి కుండలో నీళ్లు తాగుతుంటారు. ఇక వేసవి ప్రారంభమైంది. మార్కెట్లో కొన్ని చోట్ల ఈ మట్టి కుండలు లభిస్తున్నాయి. అలాగే.. ఇటీవల కాలంలో మట్టి పాత్రలతోపాటు.. మట్టి గ్లాసులు, మట్టి బాటిల్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి.

అయితే వేసవిలో సాధారణంగా దాహం వేస్తుంది. మిగతా కాలాలతో పోలిస్తే ఎండాకాలంలో గొంతు ఎండిపోతుంది. చీటికి మాటికి నాలుక తడారకుండా చూసుకోవాలి. గొంతు ఎండిపోతోంది. ప్రతి అరగంటకోసారి నీళ్లు తాగాలనిపిస్తుంది. ఈ కాలంలో చాలా మంది ఫ్రిజ్ వాటర్ తాగుతుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరం. గొంతు తడుపుకోవడానికి ఫ్రిజ్ వాటర్ అవసరం లేదు. మట్టి కుండలో నీరైతే చాలు. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఇందులో దాగి ఉన్నాయి. సహజత్వానికి ప్రతీక..ఏదైనా సహజత్వం వేరు తయారు చేసింది వేరు. మనం ఫ్రిజ్ ను తయారు చేసుకుంటాం.

అందుకే అందులో ఉండే నీటితో మనకు ముప్పే. కానీ చాలా మంది ఫ్రిజ్ కే ఆకర్షితులవుతున్నారు. పైగా ఫ్రిజ్ ఉంటే ఏదో సోషల్ స్టేటస్ ఉన్నట్లు బిల్డప్ ఇస్తుంటారు. నిజానికి ఫ్రిజ్ ఇంట్లో ఉండటం అంత శ్రేయస్కరం కాదు. కానీ కొనుక్కున్నాక వాడక తప్పక వాడుతున్నారు. చల్లదనం..ఫ్రిజ్ లో చల్లదనానికి కుండలో ఉండేదానికి చాలా తేడా ఉంటుంది. నక్కకు నాగలోకానికి ఉన్న తేడా గమనించవచ్చు. మట్టి కుండలో నీరు తాగడం వల్ల మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. కానీ ఫ్రిజ్ వాటర్ తాగితే గొంతు పట్టుకుంటుంది.

జలుబు, జ్వరం వంటి రోగాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. గొంతు సమస్యలు ఉన్న వారైతే ఫ్రిజ్ వాటర్ కు ఎంత దూరం జరిగితే అంత మంచిది. రోగాలు రాకుండా..మట్టి కుండ రోగాలు రాకుండా నిరోధిస్తుంది. గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి జబ్బులు రాకుండా చేస్తుంది. మనం తిన్న ఆహారాలు త్వరగా జీర్ణం అయ్యేందుకు దోహదపడుతుంది. ఇలా మట్టికుండ మనకు అనేక లాభాలు కలిగిస్తుందని తెలిసినా ఎందుకో ఫ్రిజ్ వాటర్ కు ఆకర్షితులవుతున్నారు. తక్షణమే వైద్యులను కలిసి తమ అనారోగ్యాలను దూరం చేసుకుంటున్నట్లు తలుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker