రొమాంటిక్ గా క్లాస్‌రూంలో మేడంతో స్టూడెంట్ డ్యాన్స్. వైరల్ అవుతున్న వీడియో.
మేము స్కూల్‌లో ఉన్నపుడు టీచర్స్‌ను చూస్తే వణికిపోయేవాళ్లం కానీ.. ఈ స్టూడెంట్ అయితే ఏకంగా మంచి రొమాంటిక్ సాంగ్‌కు డ్యాన్స్ చేశాడని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఎందరో విద్యార్థులు కనే కలలో ఆ వ్యక్తి జీవిస్తున్నాడని మరికొందరు చెబుతున్నారు. అయితే సాధారణంగా స్కూల్‌లో టీచర్ అంటే.. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించడం, విద్యార్థులు తప్పు చేస్తే దండించడం వంటివి చేస్తుంటారు.
ఈ క్రమంలోనే.. విద్యార్థులు కూడా ఎక్కడ హోం వర్క్ చేయకపోయిన, మార్కులు తక్కవు వచ్చిన టీచర్ దగ్గరకి వెళ్లాలన్నా, వారిని చూసిన గజ గజ వణికిపోతుంటారు. అయితే తాజాగా ఓ స్టూడెంట్ మాత్రం అందుకు చాలా భిన్నంగా ఉన్నాడు. ఏకంగా క్లాస్ టీచర్ తో కలిసి క్లాస్ రూమ్‌లోనే అద్భుతమైన రొమాంటిక్ సాంగ్‌కు కాలు కదిపాడు. ఇక వారిద్దరి డ్యాన్స్ చూసి క్లాస్ రూమ్ లో ఉన్న వారంతా చప్పట్లు, విజిల్స్ వేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు.
కాగా, ప్రస్తుతం ఆ టీచర్ మేడమ్ చేస్తున్న డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. మేడం, స్టూడెంట్ కాంబినేషన్ సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియకపోయినప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో Kushal_mj అనే అకౌంట్ నుంచి ఈ వీడియో షేర్ చేయడం జరిగింది. దీంతో ఆ పోస్ట్ తెగ చక్కర్లు కొడుతూ..లైక్‌లు షేర్లతో వైరల్ అవుతుంది.
ఇక క్లాస్ రూమ్ లో లేడీ టీచర్, స్టూడెంట్ డ్యాన్స్ చేస్తున్న ఆ వీడియో.. హైస్కూల్‌లో జరిగిన ఓ ఫేర్‌వేల్ డే సందర్భంగా చేసిందిగా తెలుస్తోంది. కాగా, వారు బాలీవుడ్ నుంచి ఆషికీ 2 లోని.. తుమ్ హి హో అనే పాటకు డ్యాన్స్ చేస్తూ అందర్ని ఆకట్టుకున్నారు. అయితే అందులో ఆ స్కూల్ టీచర్ నల్ల చీర కట్టుకొని ఉండగా.. స్టూడెంట్ స్కూల్ యూనిఫామ్‌లో ఉన్నారు.