News

చుడీదార్‌ గ్యాంగ్ కలకలం, రాత్రివేళ ఆడవారి వేషంలో వచ్చి ఏం చేస్తున్నారో తెలుసా..?

చైన్ స్నాచర్లు, చెడ్డి గ్యాంగ్ లతో భయపడిపోయిన ప్రజలు.. తాజాగా చుడీదార్ గ్యాంగ్‌తో హడలెత్తిపోతున్నారు. ఇటీవల ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్లో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లోకి ఇద్దరు దుండగులు చొరబడ్డారు. వారిద్దరిలో ఒకరు చూడీదార్, మరొకరు బుర్కా ధరించి మహిళల గెటప్ లో ఇంట్లోకి ప్రవేశించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్వరరావు ఈనెల 16న హైదరాబాద్ నుంచి ఒంగోలు కి వెళ్లారు.

తాను తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లోనే వస్తువులు మొత్తం చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇంటికి వేసిన తాళం కూడా పగలగొట్టి ఉండటంతో దొంగలు పడ్డారని అనుమానించిన వెంకటేశ్వరరావు. పూర్తీ వివరాలోకి వెళ్తే హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జెక్‌ కాలనీ ఆకృతి ఆర్కెడ్‌ అపార్ట్‌మెంట్‌లో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇటీవల తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి ఊరెళ్లాడు.

అయితే.. ఈ విషయం తెలుసుకున్న దొంగలు వెంకటేశ్వరరావు ఇంట్లో దొంగతనానికి ప్లాన్ చేశారు. యథావిధిగా వెళితే దొరికిపోతామని భావించారేమో.. మహిళల్లా చుడీదార్‌లు ధరించారు. ఆ తర్వాత ముఖం కనిపించకుండా మాస్క్‌లు ధరించారు. ఆ తర్వాత ఇంట్లోకి చొరబడ్డారు. ఇక ఊరు నుంచి తిరిగి వచ్చిన ఇంటి యజమాని.. ఇంట్లో దొంగతనం జరిగిన విషయాన్ని గ్రహించాడు. వెంకటేశ్వరరావు ఇంట్లో నుంచి నాలుగు తులాల బంగారం, రూ.లక్ష నగదు, ఒక లాప్‌టాప్‌ను ఎత్తుకెళ్లినట్లు వెంకటేశ్వరరావు పోలీసులకు తెలిపాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు అపార్ట్‌మెంట్‌లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను మొత్తం పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు చుడీదార్‌లో రావడాన్ని గమనించారు. ఆ తర్వాత వారు నేరుగా వెంకటేశ్వరరావు అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి చోరీకి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామనీ.. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సార్‌నగర్‌ పోలీసులు తెలిపారు. దుండగులను పట్టునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కాగా.. ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్తున్న వారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker