ఓటీటీలో దుమ్ముదులుపుతున్న మలయాళ సస్పెన్సు థ్రిల్లర్, మీరైతే ఊపిరి బిగబట్టి చూస్తారు.
మలయాళ సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. అలాంటిది మైండ్ బ్లాక్ అయ్యేలా, మెదడుకు పదును పెట్టడంతో మతి పోగొట్టే మలయాళ సినిమానే చురులి. మలయాళ స్టార్ యాక్టర్స్ జోజు జార్జ్, సౌబిన్ షాహిర్ నటించిన ఈ సినిమాలో చెంబన్ వినోద్ జోస్, వినయ్ ఫోర్ట్ ప్రధాన పాత్రలు పోషించారు. అయితే దేశవ్యాప్తంగా మలయాళ చిత్రాలకు బాగా ఆదరణ దక్కుతుంది. ఇటీవల కాలంలో మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన పలు చిన్న సినిమాలు భారీ విజయాలు అందుకున్నాయి. ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్, ఆవేశం ఇందుకు ఉదాహరణలు.
థియేటర్ లో సూపర్ హిట్ అయిన మూవీస్ ఓటీటీలో అదే రేంజ్ లో హవా చూపిస్తున్నాయి. కామెడీ, రొమాంటిక్, హారర్, థ్రిల్లర్ ఇలా డిఫరెంట్ జోనర్లలో అద్భుతమైన కంటెంట్ మూవీ లవర్స్ ని అలరిస్తుంది. తాజాగా అదిరిపోయే సస్పెన్స్ థ్రిల్లర్ ఒకటి ఓటీటీలో అందుబాటులో ఉంది. మతిపోగొట్టే ట్విస్టులు, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఉత్కంఠగా సాగే కథనం తో ఈ సినిమా ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. ఓటీటీ లోకి వచ్చిన ఈ ‘ చురులి ‘ సినిమా విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ మలయాళ మూవీ ‘ చురలి ‘ సోనీ లివ్ లో అందుబాటులో ఉంది.
ఈ సినిమాలో వినోద్ జోస్, వినయ్ ఫోర్ట్, జోజు జార్జ్, సౌబిన్ షాహిర్, జాఫర్ ఇడుక్కి, గీత సంగీత కీలక పాత్రల్లో నటించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కథ విషయానికి వస్తే .. జాయ్ అనే నేరస్థుడిని పట్టుకునేందుకు ఆంటోనీ, షాజీవన్ పేర్లు మార్చుకుని దట్టమైన అడవి మధ్యలో ఉండే ‘ చురులి ‘ అనే గ్రామానికి వెళ్తారు. ఇద్దరు అండర్ కవర్ పోలీసులుగా ఆ గ్రామం లోకి వెళ్తారు. చురులిలో తంకన్ అనే వ్యక్తికి చెందిన రబ్బరు తోటలో గుంతలు తవ్వడానికి వచ్చిన కూలీలుగా తమను పరిచయం చేసుకుంటారు.
ఆ సమయంలో తంకన్ ఊరిలో లేకపోవడంతో ఆ ఇద్దరినీ ఓ కల్లు దుకాణం యజమాని పనిలో పెట్టుకుంటాడు. జాయ్ ఎవరో తెలుసుకుని పట్టుకునేందుకు దుకాణంలో చేరుతారు ఆంటోని, షాజీవన్. చురులి లో కి అడుగు పెట్టిన ఆ పోలీసులకు ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. అక్కడున్న గ్రామస్థులు వింతగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు. రాత్రి పడుకున్నాక షాజీవన్ కి వచ్చే కలలు ఏంటి. వాటి అర్థం ఏంటి. చివరకు జాయ్ ని పోలీసులు పట్టుకున్నారా. అసలు జాయ్ చేసిన నేరాలు ఏంటి అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.