చూయింగ్ గమ్ నములుతూ పొరపాటున మింగితే ఏమవుతుందో తెలుసా..?
చూయింగ్ గమ్ నమలుతూ కూర్చోవడంతో చాలామందికి ఆకలి వేయదు. దీంతో తక్కువ ఆహారం, స్నాక్స్ తింటారు జనం. ఇది బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది. చూయింగ్ గమ్ తినేవారిలో అధిక కేలరీలు ఖర్చవుతాయట. బ్రేక్ ఫాస్ట్, లంచ్ మధ్య విరామంలోనే ఇది పనిచేస్తుందట. అయితే చూయింగ్ గమ్ నమలడం వల్ల కేలరీలు ఖర్చువుతాయి. అది కూడా కేవలం షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని నిపుణలు అంటున్నారు.
షుగర్ ఫ్రీ చూయింగమ్‌ను గంట నమిలితే 11 కేలరీలు ఖర్చవుతాయట.అయితే.. వర్కవుట్స్ చేస్తూ చూయింగ్ గమ్ నమలితే ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయి. అంతే కాకుండా 40 ఏళ్లు దాటిన వారు చూయింగ్ గమ్ నమలడం వల్ల చాలా ప్రయోజనాలను ఉన్నాయని ఓ అధ్యయనంలో తేలింది. చూయింగ్‌గమ్‌ను మింగేస్తే… పేగులకు చుట్టుకుపోతుందని చాలా మంది భయపడుతుంటారు.
అయితే అది నిజం కాదని, మానవ శరీరం చూయింగ్ గమ్‌ను జీర్ణించుకోలేదని, దాన్ని మింగడం వల్ల పేగులకు ఎటువంటి సమస్య రాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చూయింగ్ గమ్‌లను నమిలి ఊసేయకుండా మింగేస్తే మాత్రం అవి పేగుల్లో ఆటంకాలు సృష్టిస్తుందట. చూయింగ్ గమ్‌లు చాలా వరకు తియ్యగా ఉంటాయి. వాటిలో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. చక్కెరతో చేసిన చూయింగ్ గమ్ దంతాలకు హాని కలిగిస్తుంది. ఇది కావిటీలకు కూడా దారి తీస్తుంది.
షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ నమలడం వల్ల కేలరీలు ఖర్చటినప్పటికీ.. అది కొద్ది పరిమాణంలో మాత్రమే. ఇది దంతాలను శుభ్రం చేయడమే కాకుండా దవడలకు వ్యాయామంగా ఉపయోగపడుతుంది. అయితే చూయింగ్ గమ్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపుబ్బరం సమస్య వచ్చే ప్రమాదం ఉంది. కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యి మంట వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇక ఇది తినాలా వద్దా..తింటే ఎంత వరకూ తినాలి అనేది మీ ఇష్టం.. అధ్యయనాలు అయితే పై విషయాలు చెప్తున్నాయి.