Health

ఈ చిట్టి విత్తనాలు మధుమేహ రోగులకు దివ్యౌషధం, నీటిలో వేసుకొని ఒక్కసారి త్రాగితే చాలు.

చియా సీడ్స్ మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. చియా సీడ్స్ రక్తంలో చక్కెర నిర్వహణను మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా గుండె సమస్యలకు, బరువు తగ్గడానికి, బలమైన ఎముకలను నిర్మించడానికి ఇవి ఉపయోగపడతాయి. అందుకే వీటిని స్మూతీలోనూ, సలాడ్స్​లోనూ.. కొన్ని ముఖ్యమైన డిష్​లలోనూ కలిపి తీసుకుంటారు. అయితే ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే విత్త‌నాల్లో చియా సీడ్స్ కూడా ఒకటి.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీటి వినియోగం అత్య‌ధికంగా పెరిగింది. ఇక మ‌ధుమేహుల‌కు చియా సీడ్స్ ఓ వ‌ర‌మనే చెప్పొచ్చు. షుగ‌ర్ కంట్రోల్ ద‌గ్గ‌ర నుండి వెయిట్ లాస్ వ‌ర‌కు అనేక విధాలుగా చియా సీడ్స్ మ‌ధుమేహం భాదితులకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఒక గ్లాస్ తీసుకుని అందులో ఒక‌టిన్న‌ర టేబుల్ స్పూన్ వాట‌ర్‌లో నాన‌బెట్టుకున్న చియా సీడ్స్‌, వ‌న్ టేబుల్ స్పూన్‌ ఆపిల్ సైడర్ వెనిగర్, పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, గ్లాస్ గోరు వెచ్చ‌ని వాటర్ వేసుకుని బాగా క‌లిపి సేవించాలి.

ప్రతి రోజూ ఉదయాన్నే చియా సీడ్స్‌ను ఈ విధంగా తీసుకుంటే షుగ‌ర్ కంట్రోల్‌లో ఉంటుంది. బాడీ డిటాక్స్ అవుతుంది. చెడు కొలెస్ట్రాల్ క‌రిగి గుండె ఆరోగ్యంగా మారుతుంది. అలాగే మ‌ధుమేహం ఉన్న‌వారు త‌ర‌చూ నీర‌సం స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతుంటారు. అయితే నీర‌సాన్ని త‌రిమి కొట్ట‌డంలో చియా సీడ్స్ గొప్పగి స‌హాయ‌ప‌డతాయి. అందుకోసం బ్లెండ‌ర్ తీసుకుని అందులో నాన‌బెట్టుకున్న చియా సీడ్స్ ను రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి.

అలాగే ఒక క‌ప్పు యాపిల్ ముక్క‌లు, ఒక క‌ప్పు సోయా పాలు, రెండు టేబుల్ స్పూన్ల తేనె, వ‌న్ టేబుల్ స్పూన్ రోల్డ్ ఓట్స్‌, హాఫ్ టేబుల్ స్పూన్ కోకో పౌడ‌ర్, అర క‌ప్పు వాట‌ర్ వేసుకుని గ్రైండ్ చేసుకుంటే. టేస్టీ స్మూతీ రెడీ అవుతుంది. బ్రేక్ ఫాస్ట్‌లో ఈ స్మూతీని తీసుకుంటే రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. నీర‌సం ద‌రి దాపుల్లోకి కూడా రాకుండా పారిపోతుంది.

దీంతో పాటు వెయిట్ లాస్ కూడా అవుతారు. ఇక మ‌ధుమేహం ఉన్న వారు చియా సీడ్స్‌ను స‌లాడ్స్‌లో క‌లిపి తీసుకోవ‌చ్చు. గోధుమలతో కలిపి ఉడికించి తినవచ్చు. ఓట్ మీల్ లో కలుపుకుని తీసుకోవ‌చ్చు. ఇలా ఎలా తిన్నా ఆరోగ్యానికి చియా సీడ్స్ ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డానికి సూప‌ర్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker