ఈ విత్తనాలు తరచూ తింటే షుగర్, నరాల సమస్యల నుంచి బయపదోచ్చు.
అసలు చియా విత్తనాలు అంటే ఏమిటి? ఎప్పుడూ వినలేదు.. ఈ మధ్యే ఎక్కువగా వింటున్నాం.. ఎక్కడ దొరుకుతాయి అంటే.. చియా విత్తనాలను శాస్త్రీయ పరిభాషలో శాన్వియా హిస్పానికా అని పిలుస్తారు. ప్రకృతి మనకు అందించిన అతికొద్ది సూపర్ ఫుడ్లలో చియా విత్తనాలు ఒకటిగా పరిగణించబడతాయి. అయితే చియా విత్తనాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి శరీర మంటను తగ్గించడానికి సహాయపడతాయి.
అంతేకాదు దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్, మాంగనీస్, ఫాస్పరస్, విటమిన్ బి1, జింక్, విటమిన్ బి2, విటమిన్ బి3లు శరీర శక్తిని పెంచుతాయి. ఇకపోతే చియా విత్తనాల్లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి హాని చేసే ఫ్రీరాడికల్స్ నుంచి కాపాడుతాయి. ఇవి ప్రాణాంతకమైన క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది. అంతేకాదు ఇవి ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతాయి. దీంతో ఎన్నో రకాలా అంటువ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. చియా విత్తనాలు బరువు తగ్గేందుకు కూడా సహాయపడతాయి.
వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది ఆకలిని నింయత్రిస్తుంది. అంటే మొత్తంగా ఇది మీరు ఫాస్ట్ గా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. రోజూ కొంత మొత్తంలో చియా విత్తనాలను తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. అక్కడ కొవ్వు పేరుకుపోయే అవకాశం కూడా ఉండదు. చియా గింజలు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. వీటిలో పుష్కలంగా ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలో పేరుకుపోయినా కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. దీంతో గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది.
మధుమేహులకు చియా విత్తనాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని పలు పరిశోధనల్లో తేలింది. ఇవ ఈ విత్తనాల్లో ఎక్కువ మొత్తంలో ఉండే కాల్షియం ఎముకలను బలంగా చేస్తుంది. చియా విత్తనాల్లో పుష్కలంగా ఉండే ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం లు శరీరంలో సోడియాన్ని నియంత్రణలో ఉంచుతాయి. ఈ గింజలనుు తినడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. అందుకే హైబీపీ పేషెంట్లు వీటిని తినాలని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు.