News

స్మశానంలో చితిపై నుంచి ఒక్కసారిగా లేచిన వ్యక్తి, భయంతో పరుగులు తీసిన జనం.

నిద్ర లేచినట్లు పాడే మీద నుంచి లేస్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది .. చూడాలంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పై లుక్ వేయాల్సిందే.. ఈ నాటకీయ సన్నివేశం మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. ‘చనిపోయిన’ వ్యక్తి నిద్ర లేచినట్లు లేచి కూర్చున్నాడు. మోరీనాలో దహన సంస్కారాలకు కొద్ది క్షణాల ముందు మేల్కొన్న వ్యక్తి, వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది.

అయితే మధ్యప్రదేశ్… మొరెనా నగరంలోని 47వ వార్డుకి చెందిన శాంతిధామ్‌కి సంబంధించినది. ఇక్కడ యువకుడైన జీతూ ప్రజాపతి చాలా కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. మే 30న అకస్మాత్తుగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. అతడి శరీరంలో ఎలాంటి కదలికా లేకపోవడంతో బంధువులు మృతి చెంది ఉంటాడని భావించారు. ఆ సమయంలో అతని ముక్కుపై వేలు ఉంచి.. శ్వాసను చెక్ చేశారు. అలాగే.. ఛాతీపై చెవి ఆనించి.. గుండె లయను చెక్ చేశారు.

ఎలాంటి స్పందనా రాకపోవడంతో అతను బతికి లేడని భావించారు. వెంటనే బంధువులు, ఇరుగుపొరుగు వారికి ఫోన్ చేసి శవపేటిక సిద్ధం చేశారు. బంధువులు జీతూ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసి.. విశ్రాంఘాట్‌కి తీసుకెళ్లారు. అక్కడ చితిని సిద్ధం చేశారు. కాసేపట్లో తగలబెట్టాల్సి ఉండగా.. అతనిలో కదలిక వచ్చింది. అది చూసిన బంధువులు షాక్‌ అయ్యారు. వెంటనే డాక్టర్‌ని అక్కడికి పిలిపించారు.

డాక్టర్ టెస్ట్ చేసి.. ECG, ట్రీట్‌మెంట్ కోసం.. గ్వాలియర్‌కు తీసుకెళ్లమని సూచించారు. జీతూ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్ చేసిన డాక్టర్లు.. ఆ తర్వాత అతని పరిస్థితి ఎలా ఉందో వెంటనే చెప్పలేదు. అరగంట తర్వాత చెబుతామన్నారు. దాంతో.. కుటుంబ సభ్యులతోపాటూ.. ఊరి ప్రజలకు కూడా అతను బతికే ఉన్నాడా.. చనిపోయాడా అనే టెన్షన్ కొనసాగింది.

అరగంట తర్వాత డాక్టర్ తాపీగా వచ్చి.. జీతూ బతికే ఉన్నాడని చెప్పడంతో… కుటుంబ సభ్యులు.. ఊరట చెందారు. గ్రామస్థులు కూడా పోన్లే బతికిపోయాడు అని అనుకున్నారు. జీతూ.. చనిపోయి బతికాడా లేక.. కొంతసేపు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడా అనేది తేలలేదు. ఈ ఘటన స్థానికంగా అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker