వామ్మో, మెగాస్టార్ చిరంజీవి వాచ్ ధర ఎంతో తెలుసా..?
సెలబ్రెటీలు చాలా సందర్భాలలో ఖరీదైన వస్తువులను ధరించి తిరుగుతుంటారు. వారు ధరించే బ్రాండెడ్ వస్తువుల ధర లక్షలాది రూపాయలు.. కొంతమందివి కోట్లలో కూడా ఉంటాయి. ఒక్కోసారి చిన్నదే కదా అనుకుంటాం.. దాని విలువ కోట్ల రూపాయలకు మించి ఉంటుంది. అభిమానులు ఆ ఖరీదైన వస్తువు ధర తెలిసి షాక్ అవుతారు.
అయితే తాజాగా వరుణ్ తేజ్ కొత్త సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో కనిపించిన చిరు.. ఏ.లాంజ్ & సోహ్నే అనే బ్రిటీష్ కంపెనీ చేతి గడియారంతో కనిపించారు. దీని ధర ఎంత అని ఆరా తీస్తే షాకింగ్ నంబర్స్ కనిపించాయి.
భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ.50,56,747 అని తెలుస్తోంది. అంటే అరకోటి అనమాట. అదేదో సినిమాలో అన్నట్లు చిరు కట్టుకున్న ఈ వాచీ అమ్మితే బ్యాచ్ బ్యాచ్ సెటిలైపోవచ్చు! చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్నారు.
సోషియో ఫాంటసీ స్టోరీతో తీస్తున్న ఈ సినిమాని డైరెక్టర్ వశిష్ట తీస్తున్నారు. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ తీస్తున్న ఈ మూవీ.. 2025 సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించేశారు కూడా.