చింతచిగురు కొంచం తింటే గొంతు నొప్పి ,గొంతు ఇన్ఫెక్షన్ సమస్యలు వెంటనే తగ్గిపోతాయి.
చూస్తే చిన్నదైనా.. అది చేసే మేలు మాత్రం పెద్దదని ప్రకృతి వైద్యనిపుణలు చెబుతున్నారు. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు కృషిచేస్తుంది. దీంతో చింతచిగురును తినేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. చింతచిగురు ప్రేమికులు చింతచెట్ల వద్ద చిగురును కోసే పనిలో పడుతున్నారు. రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. అయితే చింత చిగురు పచ్చడి దగ్గర నుంచి చాపల పులుసు వరకు విరివిగా ఉపయోగిస్తారు. చాలామందికి చింతపండు తెలుసుగాని చింతచిగురుని వండుకోవచ్చు అన్న విషయం తెలియదు.
అలాంటి వాళ్ళు చింతచిగురు లో ఎన్ని బెనిఫిట్స్ దాగి ఉన్నాయో తెలిస్తే దీన్ని అస్సలు వదులుకోరు. వెజ్, నాన్ వెజ్ వంటల లో రుచి కోసం చింతచిగురుని వాడవచ్చు. చింతచిగురుని ఎండబెట్టి పొడి చేసి నిల్వ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇరు తెలుగు రాష్ట్రాలలో చింతచిగురు వాడకం ఎక్కువగా ఉంటుంది. ఇది కేవలం రుచికి మాత్రమే కాదు దీన్ని ఉపయోగించడం వల్ల పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
చింత చిగురు పప్పు ,రొయ్యల ఇగురు, చింత చిగురు పచ్చడి..వేడి వేడి అన్నంతో వీటిలో ఏదైనా కాంబినేషన్ తలచుకుంటే నోట్లో నీళ్లు ఊరుతుంది. చింతచిగురులో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది కాబట్టి ఇది మనలో రక్తహీనత సమస్యను అదుపులో పెడుతుంది. చిన్నపిల్లలకి చింత చిగురు పెట్టడం వల్ల మంచి బలం చేకూరుతుంది. కామెర్ల వ్యాధిని కూడా నయం చేసే గుణం చింత చిగురుకు ఉంది.
కామెర్లతో బాధపడే వారికి చింతచిగురు రసం..పటిక బెల్లంతో కలిపి ఇస్తే మంచిది. చింతచిగురు ఆహారంలో తీసుకోవడం వల్ల వాతం వంటి లక్షణాలు తగ్గడమే కాకుండా కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. గొంతు నొప్పి ,ఇన్ఫెక్షన్ వంటి సమస్యలకు కూడా చింతచిగురు బాగా పనిచేస్తుంది. చింతచెగురు క్రమం తప్పకుండా తీసుకునేవారికి కడుపులో నులిపురుగుల సమస్య కూడా తలెత్తదు.
చింత చిగురును తినడం వల్ల రోదనిరోధక శక్తి పెరుగుతుంది. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు చింతచిగురు తీసుకోవడం వల్ల ఉపశమనం పొందుతారు.ఇందులో అధిక మోతాదులో లభించే ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొవ్వును తగ్గించి.. మంచి కొవ్వును పెంచుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది.