పిల్లలు రాత్రి నిద్రలో పక్క తడుపుతున్నారా..? దాన్ని ఆపే అద్భుతమైన చిట్కా.
ముందుగా పిల్లలు పక్కతడుపుతుంటే అరవకండి. వారిని దగ్గరగా తీసుకొని ప్రేమగా మాట్లాడండి. పిల్లలు లో భయం, అశాంతి, అభద్రతాభావం, ప్రేమరాహిత్యం, నరాల బలహీనత వలన ఈ సమస్య వస్తుంది. రాత్రిపూట నిద్రకు ముందే మూత్ర విసర్జన చేయించండి. అయితే చిన్న పిల్లలు రాత్రుల్లో బెడ్ వెట్టింగ్ చేస్తుంటే అర టేబుల్ స్పూన్ నేరుడు గింజల పౌడర్ ను నీళ్ళలో మిక్స్ చేసి రోజుకు రెండు సార్లు ఇవ్వడం వల్ల రెండు మూడు వారాల్లో ఈ అలవాటును మానుకుంటారు. మూత్ర సమస్యలు, కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్ళు ఈ పండు తింటే ఉపశమనం కలుగుతుంది.
గర్భిణీలు తింటే తల్లికీ, బిడ్డకీ మంచిది. మెదడును చురుగ్గా ఉంచడానికి, హార్ట్ బీట్ సరిగా ఉంచడానికి నేరేడు ఔషధంలా పనిచేస్తుంది. నేరుడు గింజలను పౌడర్ చేసి, ఆపౌడర్ ను పాలతో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి మరుసటి రోజు ఉదయం శుభ్రంగా కడిగితే మొటిమలు తగ్గుతాయి. నేరేడులో విటమిన్ సీ, ఏ పుష్కలంగా ఉంటాయి. ఇది కంటి సమస్యలు, నొప్పులను నివారించడంలో సహాయపడుతుంది. కాల్షియం, పొటాషియం, ఇనుము, విటమిన్-సీ అధిక మోతాదులో ఉంటాయి కనుక వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది.
ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. మూత్రం రాక ఇబ్బంది పడుతున్నప్పుడు నేరేడు తింటే మంచిదని పలువురు వైద్యులు చెబుతు న్నారు. నేరుడు ఆకులను ఆయుర్వేద చికిత్సల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. వీటిలోని వైద్యపరమైన గుణాల వల్ల డయోరియా, అల్సర్ వంటి జబ్బులను నివారిస్తారు. ఈ పండు ఆకుల్ని దంచి కషాయంగా కాచి నోట్లో వేసుకొని పుక్కలిస్తే దంత, చిగుళ్ల సమస్యలు రావు. నేరేడు పళ్లను తీసుకొనే వారిలో పళ్లు, చిగుళ్లు బలంగా ఉంటాయి.
ఆకుల్ని దంచి కషాయంగా కాచి పుక్కిలిస్తే దంతాలు కదలడం.. చిగుళ్ల వాపులు, పుండ్లు వంటివి త్వరగా తగ్గుతాయి. ఆకులను నమిలి నీళ్లతో పుక్కిలించి ఉమ్మి వేస్తుంటే.. నోటి దుర్వాసన తగ్గుతుంది. జిగట విరేచనాలతో బాధపడేవారు రోజుకు 2-3 చెంచాలా నేరేడు పండ్ల రసాన్ని తాగాలి. ఇలా చేస్తే రోగికి శక్తితో పాటు పేగుల కదలిక నియంత్రణలో ఉంటాయి. జ్వరంలో ఉన్నప్పుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే.. శరీరంలోని వేడి తగ్గుతుంది. నేరేడు కాయలకు రక్తాన్ని శుద్ధి చేసే గుణం కూడా ఉంది.