మీ పిల్లలకు డెంగ్యూ జ్వరం రాకుండా ఉండాలంటే ఈ జాగర్తలు పాటించాలి.
డెంగ్యూ జ్వరం డెంగ్యూ వైరస్ వల్ల వచ్చే దోమల వల్ల కలిగే వ్యాధి. లక్షణాలు సాధారణంగా సంక్రమణ తర్వాత మూడు నుండి పద్నాలుగు రోజుల తరువాత ప్రారంభమవుతాయి. ఇందులో అధిక జ్వరం, తలనొప్పి, వాంతులు, కండరాలు, కీళ్ల నొప్పులు, చర్మపు దద్దుర్లు ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడటానికి సాధారణంగా రెండు నుండి ఏడు రోజులు పడుతుంది. తక్కువ సంఖ్య కేసులలో, ఈ వ్యాధి తీవ్రమైన డెంగ్యూగా అభివృద్ధి చెందుతుంది, దీనిని డెంగ్యూ హెమరేజిక్ జ్వరం అని కూడా పిలుస్తారు, దీని ఫలితంగా రక్తస్రావం, తక్కువ స్థాయి బ్లడ్ ప్లేట్లెట్స్, బ్లడ్ ప్లాస్మా లీకేజ్ లేదా డెంగ్యూ షాక్ సిండ్రోమ్గా మారుతుంది.
అయితే ఇటీవల కాలంలో దేశంలో డెంగ్యూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దోమల విజృంభణతో ఈ కేసులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంట్లో చిన్నపిల్లలను దోమలు కుట్టకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీరు ఎక్కువగా నిల్వ వుండే ప్రాంతాల్లో దోమలు పుట్టుకొస్తాయి.
ఇవి కుట్టడం వల్ల పిల్లలకు దద్దుర్లు, తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలు వస్తాయి. అందుకే వీటిని గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. ఈ సమయంలో మీ ఇంట్లో చుట్టూ పక్కల నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. పూల కుండీలు, బకెట్లు, పాత టైర్లలో ఎక్కువ కలం నీరు నిల్వ లేకుండా చూడాలి.
అలాగే చెత్తా చెదారం లేకుండా కూడా చూసుకోవాలి. ఇక దోమలు కుట్టకుండా లభించే క్రీములను వాడడం మంచిది. పిల్లల వయసుకు తగ్గట్టు మార్కెట్ లో ఇవి లభిస్తాయి. అలాగే రాత్ర్రి నిద్రపోయే సమయంలో మీ బెడ్ పై లేదా మంచం చుట్టూ దోమ తెరలను ఉంచడం మంచిది.
అలాగే ఇంట్లోకి దోమలు ఇంట్లోకి రాకుండా కిటికీలు, తలుపులకు తెరలను వాడండి. పిల్లలు ఆరుబయట వున్నప్పుడు వారికీ పొడవాటి చేతుల షర్టులు, ప్యాంట్లు, సాక్సులు,బూట్లు ధరించండి. దోమలు తెల్లవారుజామున, రాత్రి ఎక్కువ యాక్టివ్ గా వుంటాయి. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.