Health

పిల్లలకి దగ్గు మందు ఇచ్చేముందు జాగర్త, అసలు విషయాలు తెలిస్తే..?

సాధారణంగా ఏడాదిలోపు శిశువులకు కోల్డ్‌, కాఫ్‌ సిరప్‌లు అస్సలు వాడకూడదు. నాసోక్లియర్‌ సెలన్‌ నాజల్‌ డ్రాప్స్‌ వంటివి వాడాలి. పెద్దవారికి వాడే కాఫ్‌ సిరప్స్‌ పిల్లలకు వాడకూడదు. సాధారణంగా పిల్లల్లో దగ్గు వెంటనే తగ్గదు. మూడు నాలుగు రోజులు పెరిగి తరువాత క్రమంగా తగ్గుతుంది. ఫ్రీక్వెంట్‌గా నీరు ఎక్కువగా తాగిస్తే దగ్గు తగ్గుతుంది. అయితే ఔషదాలను జాగ్రత్తగా తయారు చెయ్యకపోయినా, జాగ్రత్తగా వాడక పోయినా అవి ప్రాణాలు కాపాడాల్సింది పోయి ప్రాణాలు తీస్తాయని గాంబియాలో జరిగిన పలు సంఘటనలు మరోసారి రుజువు చేస్తున్నాయి.

మైడెన్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఫార్మా కంపెనీ నుంచి తయారైనా నాలుగు రకాల దగ్గు, జలుబు మందులు పిల్లల మరణాలకు కారణం. ఈ బైడెన్ ఫార్మా కంపెనీ మన దేశానికి చెందినదే. పిల్లల మరణానికి కారణమైన ఆ నాలుగు మందులు ఇక్కడ తయారైనవే. గాంబియాలో 66 మంది పిల్లల మరణంతో ఇండియాలో తయారైన ఆ నాలుగు మందులను ప్రపంచ ఆరోగ్య సంస్థ నిషేధించింది. ఈ ఘటనపై సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) వెంటనే దర్యాప్తు ప్రారంభించింది.

హర్యానాకు చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తయారు చేసిన ఈ మందులు విషపూరితమని వ్యాఖ్యానించింది. ఆ నాలుగు మందులు పిల్లల దగ్గు, జలుబుకు వాడే సిరప్‌లు. వీటిలో ప్రోమెథాజైన్ ఓరల్ సొల్యూషన్, కొఫెక్స్ మలిన్ బేబీ కాఫ్ సిరప్, మాకాఫ్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్ ఉన్నాయి. మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్‌లో తయారైన ఈ ఉత్పత్తుల్లో డైఇథలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్ కలుషితాలు ఉన్నట్టుగా పరీక్షల్లో తేలిందని గ్లోబల్ హెల్త్ ఏజెన్సీ పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం దాదాపుగా 23 నమూనాలలో ఈ నాలుగు డైఇథలిన్ గ్లైకాల్ లేదా ఇథలిన్ గ్లైకాల్ ఉన్నట్టుగా తేలింది.

డై ఇథలిన్ గ్లైకాల్ విషపూరితమైంది. దీన్నీ వాడినపుడు కిడ్నీ, నాడీ మండలం మీద దీని ప్రభావం ఉంటుంది. ఈ రసాయనాన్ని మందులలో ఉపయోగించినపుడు మాస్ పాయిజనింగ్ జరిగినట్టు ఇది వరకు కూడా రుజువులు ఉన్నాయి. డై ఇథలిన్ రుచి తియ్యగా ఉంటుంది. ఎటువంటి వాసన, రంగు లేని హైగ్రోస్కోపిక్ ద్రవం. ఇది నీరు, ఆల్కహాల్, ఈథర్, అసిటోసిన్, ఇథిలిన్ గ్లైకాల్ లో బాగా కలిసిపోతుంది. డైఇథలిన్ గ్లైకాల్ తీసుకున్నపుడు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, మూత్రవిసర్జనలో సమస్యలు, తలనొప్పి, ఒక్కోసారి మతి బ్రమణం కలుగవచ్చు. కిడ్నీలకు తీరని నష్టం కూడా జరగవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker