పిల్లల్లో కనిపించే ఈ కరోనా లక్షణాలతో జాగ్రత్త.

పిల్లల్లో కనిపించే ఈ కరోనా లక్షణాలతో జాగ్రత్త.

పిల్లలకు కోవిడ్‌-19తో పెద్ద ప్రమాదం లేదు. అయినప్పటికీ అలక్ష్యం, అలసత్వం కూడదు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. వారిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (డీజీహెచ్‌ఎస్‌) సూచిస్తోంది. కోవిడ్‌ఉ19 పెద్దలతో పాటు పిల్లల్లో కూడా వ్యాప్తి చెందుతోంది. అయితే చిన్నపిల్లలు కరోనా వైరస్ బారిన పడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై ఇటీవలే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కీలక సూచనలు చేసింది. చిన్నారులు కరోనా వైరస్ బారిన పడిన సమయంలో తల్లిదండ్రులు అనవసర ఆందోళనకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. చిన్నారుల్లో వైరస్ సోకినప్పుడు నాలుగు దశల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ సూచిస్తున్నారు వైద్య నిపుణులు. కొన్ని కొన్ని సార్లు చిన్నారులు ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా వైరస్ సోకే అవకాశం ఉంది.

ఈ క్రమంలోనే తల్లిదండ్రులు తమ పిల్లల శ్వాసను గమనిస్తూ ఉండాలి. అంతే కాకుండా ఇక పిల్లల రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండడం ఎంతో మంచిది. అయితే కరోనా వైరస్ బారిన పడిన చిన్నారులకు యాంటీ బయోటిక్స్ వాడటం ఏ మాత్రం మంచిది కాదు అంటూ హెచ్చరిస్తున్నారు వైద్యనిపుణులు ముక్కు కారడం జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తే ఇక దానికి సంబంధించిన తక్కువ డోస్ టాబ్లెట్లు వాడాలి అని చెబుతున్నారు. ఇక దగ్గు ఉన్నప్పుడు కేవలం వేడినీళ్లు తాగిస్తే సరిపోతుందని యాంటీబయోటిక్స్ వినియోగించు వద్దు అంటూ హెచ్చరిస్తున్నారు.

ఒకవేళ పిల్లల్లో ఆక్సిజన్ శాతం 90 శాతం కంటే తక్కువగా ఉంది అని గమనిస్తే వెంటనే ఆసుపత్రిలో చేర్చడంతో ఎంతో మంచిది. ఇలాంటి సమయంలో హోం అసోసియేషన్ లో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు అంటూ సూచిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే వైద్యుల పర్యవేక్షణలో పరిస్థితులకు అనుగుణంగా వైద్యులు చికిత్స ఇస్తారు కాబట్టి ఎలాంటి ప్రమాదం ఉండదు. కరోనా వైరస్ బారినపడి కోలుకున్న చిన్నారుల్లో బ్లాక్ ఫంగస్ లక్షణాలు పెద్దల్లో లాగా కాకుండా అతి తక్కువ మందిలో కనిపించే అవకాశం ఉంది. ఒకవేళ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రిలో చికిత్స చేయించటం మంచిది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *