Health

వీటిని తరచూ తింటుంటే మీ పిల్లలకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

అవసరమైన సందర్భాల్లో జ్ఞాపకాలను యథాతథంగా అందిస్తుంది. మన జ్ఞాపకశక్తి అపరిమతిమైనది. అయితే, ఎన్నో అవరోధాలు, ఆరోగ్య సమస్యల కారణంగా మతిమరుపు వస్తుంది. ఇది అల్జీమర్స్‌ వరకు దారితీసే ప్రమాదం ఉంటుంది. అయితే జ్ఞాపకశక్తి బాగుంటేనే మన పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. లేదంటేనా.. నానా తిప్పలు, తిట్లు పడాల్సి వస్తుంది. కానీ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారు. అయితే మెమోరీ పవర్ ను పెంచడానికి ప్రోటీన్ ఫుడ్ బాగా ఉపయోగపడుతుంది. చేపలు.. చికెన్, మటన్ కంటే చేపలే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే ట్యూనా, సాల్మన్ లేదా కాడ్ వంటి చేపలను తరచుగా తింటూ ఉండండి. ఇవి మీ మెమోరీ పవర్ ను పెంచడమే కాదు.. మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతాయి. మానసిక సమస్యలను కూడా పోగొడుతాయి. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు మెదడు పనితీరును మెరుపరుస్తాయి. కాబట్టి మతిమరుపు సమస్య ఉన్నవాళ్లు చేపలను బాగా తింటే మంచి ప్రయోజనాలను పొందుతారు. ఆకు కూరలు.. ఆకు కూరల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఖనిజాలు, విటమిన్లు, ఫైబరర్, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకుకూరలను తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి.

ఇందుకోసం పాలకూర, బచ్చలి కూర, బ్రోకలీ వంటి ఆకు కూరలను ఎక్కువగా తినండి. అలాగే ఎరుపు రంగులో ఉండే కూరగాయలను కూడా తినండి. ఇవి మీ మెమోరీ పవర్ ను పెంచుతాయి. అలాగే మీ మెదడు చురుగ్గా పనిచేస్తుంది. గుడ్లు..గుడ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుడ్లను తినడం వల్ల శరీరానికి శక్తి అందడమే కాదు.. ఎన్నో రకాల పోషకాలు కూడా అందుతాయి. రోజూ ఒక గుడ్డును తింటే శరీరం బలిష్టంగా ఉండటమే కాదు.. మెమోరీ పవర్ కూడా పెరుగుతుంది. గుడ్లలో ఎన్నో రకాల విటమిన్లు, ప్రోటీన్లు ఉంటాయి. దీనిలో ఉండే కోలిన్ మెదడు పనితీరును మెరుపరుస్తుంది. ప్రతిరోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డును తింటే మీరు ఎనర్జిటిక్ గా ఉండటంతో పాటుగా మతిమరుపు సమస్య కూడా పోతుంది.

గింజలు..విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు, కాల్షియం పుష్కలంగా ఉండే వాల్ నట్స్, గుమ్మడి గింజలు, బాదం పప్పులు, ఎండు ద్రాక్షలను తింటే.. విషయాలను మర్చిపోయే అవకాశమే ఉండదు. ఎందుకంటే ఈ డ్రై ఫ్రూట్స్ మెదడుకు ప్రయోజనకరంగా ఉంటాయి. సో వీటిని ఖచ్చితంగా తినండి. ఈ గింజలు మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. సుగంధ ద్రవ్యాలు.. పసుపు లేని కూర దాదాపుగా ఉండనే ఉండదు. పసుపు ఎన్నో అనారోగ్య సమస్యను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని నిరూపించబడింది కూడా. దీనిలో ఉండే కర్కుమిన్ ఒత్తిడిని తగ్గిస్తుంది. మెదడును యాక్టీవ్ గా చేస్తుంది. కొన్ని సుగంధద్రవ్యాలు, మూలికలు కూడా మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker