పిల్లలు అజీర్తి సమస్యతో బాధపడుతున్నారా..! ఈ అద్భుతమైన చిట్కాలు మీకోసమే.
పిల్లల్లో ఆహారం జీర్ణం కాకపోవడం, తిన్న తర్వాత ఆహారం పైకి తన్నడం వంటి లక్షణాలు పెద్దలతో పోలిస్తే చాలా తక్కువ. అయితే కొందరు పిల్లల్లోనూ పెద్దలలో కనిపించేలాంటి అజీర్తి సమస్యలు కనిపిస్తుంటాయి. దీని వల్ల పిల్లలూ బాధపడుతుంటారు. అయితే తల్లిదండ్రులుగా, మీరు మీ పిల్లలు ఏమి తింటారు, ఏమి తీసుకుంటున్నారు అనే విషయాలను తప్పనిసరిగా గమనించాలి. ప్రాసెస్డ్, ఆయిల్ ఫుడ్స్ ,షుగర్ ట్రీట్‌లను మినహాయించడం మాత్రమే గుర్తుంచుకోవలసిన విషయం కాదు.
మీరు వారికి ఆరోగ్యకరమైన ఆహార ప్రత్యామ్నాయాలను కూడా అందించారని నిర్ధారించుకోండి. ఉడికించిన కూరగాయలు.. కూరగాయలు పిల్లలకు నచ్చకపోవచ్చు. ప్రతిరోజూ మనం వాటిని తినమని చెప్పడం కూడా వారికి నచ్చదు. కానీ.. వాటిని కచ్చితంగా తినిపించాలి. ముఖ్యంగా ఉడికించిన కూరగాయలను తినిపించాలి. వాటిని వారి కళ్లకు అందంగా, ఆకర్షించేలా కనిపించేలా డెకరేట్ చేసి.. ఆ ఆహారాన్ని వారితో తినిపించే ప్రయత్నం చేయాలి. సూప్‌లు.. పిల్లలలో ఏదైనా కడుపు సమస్యలకు గురైనప్పుడు, ముఖ్యంగా స్టమక్ అప్ సెట్ అయినప్పుడు..
వెచ్చని గిన్నె సూప్, లేదా రసం, చారు లాంటివి ఆహారంగా పెట్టాలి. తక్కువ ఫైబర్ ఆహారాలు..పిల్లలకు ఫైబర్ ఉండే ఆహారాలు తినిపించాలి. ఇది అవసరం కూడా. కానీ… స్టమక్ అప్ సెట్ అయినప్పుడు మాత్రం ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను అందించడం అవసరం. ఆ సమయంలో ఫైబర్ తక్కువగా ఉండే ఆహారం అందించడం వల్ల.. వారి విరోచన సమస్యలు తగ్గే అవకాశం ఉంది. డ్రై టోస్ట్ వంటి ఆహారాలు మీ పిల్లల కడుపు సమస్యలకు చికిత్స చేసే సాధారణ పిండి పదార్థాలను కలిగి ఉంటాయి.
మసాలా ఏదైనా కడుపులో మంటను పెంచుతుంది, ఇది కడుపు నొప్పి, వికారం ఇతర సమస్యలకు దారితీస్తుంది. మసాలాకు దూరంగా ఉంచాలి. మీ పిల్లలు విరోచనాలు, కడుపులో నొప్పి, అజీర్తి సమస్యలు, స్టమక్ అప్ సెట్ వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు వారికి మంచినీరు ఎక్కువగా ఇవ్వాలి అనే విషయం మర్చిపోవద్దు. మంచినీరు ఎక్కువగా తాగడం వల్ల వారి శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. మంచినీరు మాత్రమే కాకుండా.. నిమ్మరసం, కొబ్బరినీళ్లు లాంటివి కూడా ప్రత్యామ్నయంగా తీసుకోవచ్చు.