ఒక నెల మాంసం మానేస్తే మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా..?
మన దేశాన్ని పాలించిన ఆంగ్లేయులు తమ ప్రార్థనలకు కావలసిన ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించారు. మనం కూడా దాన్నే సెలవుదినంగా పాటిస్తూ సెలవు రోజుల్లో ఎంజాయ్ అనే పేరుతో కొంతమంది మద్యమాంసాలు ఆరగిస్తున్నారు. మరికొంతమంది మాంసాహారంతో రోజును గడిపేస్తున్నారు. ఇంకొంతమంది డాక్టర్లే మాంసం తీసుకోమని చెప్పారని, అందుకే క్రమం తప్పకుండా మాంసాహారం తీసుకుంటున్నట్టు చెపుతారు.
అయితే మాంసాహారాన్ని వదిలివేయడం వల్ల శరీరంలో చాలా పెద్ద మార్పులకు కారణమవుతుందని పలు అధ్యయనాల్లో సైతం తేలింది. ఇది మీ శరీరం లోపల నుంచి బయట వరకు ప్రభావవంతంగా కనిపిస్తుందని నిపుణులు సైతం పేర్కొంటున్నారు. మీ రక్తపోటును మెరుగుపరుస్తుంది.. మాంసాహార ఆహారాలలో తరచుగా ఉప్పు ఎక్కువగా ఉంటుంది.
దీని వలన రక్తపోటు పెరుగుతుంది. దీనిని కొంతకాలం మానేయడం వల్ల మీ రక్తపోటు మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది.. నాన్-వెజిటేరియన్ ఫుడ్‌లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది.. దాని కారణంగా కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. ఒక నెల పాటు మాంసాహారం మానేయడం ద్వారా, మీ కొలెస్ట్రాల్ స్థాయి స్వయంచాలకంగా తగ్గుతుంది.
బరువు తగ్గుతుంది.. శాఖాహారం ఆహారంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అందుకే నెల రోజుల పాటు మాంసాహారం మానేయడం వల్ల బరువు తగ్గవచ్చు. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.. శాకాహార ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది.
ఒక నెల పాటు మాంసాహారం మానేయడం ద్వారా, మీ చర్మం మెరుగుపడుతుంది. శక్తి స్థాయి మెరుగుపడుతుంది.. శాకాహార ఆహారంలో క్యాలరీ కంటెంట్ తక్కువగా ఉంటుంది. కానీ ఇది శక్తి వనరుగా పనిచేస్తుంది. ఒక నెల పాటు మాంసాహారాన్ని వదులుకోవడం ద్వారా.. మీ శక్తి స్థాయిలు మెరుగుపడతాయి. ఈ మార్పులే కాకుండా, మీ జీవనశైలిలోని అనేక ఇతర అంశాలలో మార్పులను గమనించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.