ప్రజలకు అలెర్ట్, బ్రాయిలర్ చికెన్ తింటే క్యాన్సర్ వస్తుందా..?
ప్రొసెసింగ్ మాంసం కంటే చికెన్ వండుకొని తినడం చాలా మంచిది. అందులో సి బి విటమిన్లు ఉంటాయి. ఫోలేట్ సెలీనియం, కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటాయి. అయితే చికెన్ కంటే చేపలు తాజా పండ్లు, కూరగాయలు తినడం ఎంతో మంచిది అంటున్నారు. అయితే ఇది తినడానికి ఎంతో రుచిగా ఉన్నప్పటికీ పరోక్షంగా మనకు అనేక రకాల నష్టాలను కలిగిస్తోంది. ఎందుకంటే ఈ బ్రాయిలర్ కోళ్లను పెంచేందుకు అనేక రసాయనాలను ఉపయోగిస్తారు.
దీంతో చికెన్ కూడా తక్కువ కాలంలోనే పెరుగుతోంది. అయితే ఈ బ్రాయిలర్ కోడినే ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. బ్రాయిలర్ చికెన్ తినేవారికి తరచుగా క్యాన్సర్ వస్తుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. బ్రాయిలర్ చికెన్‌లో అధిక స్థాయిలో బ్యాక్టీరియా ఉంటుంది. దీన్ని తినడం వల్ల మలబద్ధకం, ఊబకాయం, హృదయ సంబంధ వ్యాధులు మరియు సోడియం స్థాయి పెరగడం, యూరిక్ యాసిడ్ పెరుగుదల, శరీర ఉష్ణోగ్రత పెరుగుదల వంటి అనేక ఇతర వ్యాధులు వస్తాయి.
అంతే కాదు ఈ రోజుల్లో మహిళలు త్వరగా యుక్తవయస్సుకు చేరుకోవడానికి కారణం బ్రాయిలర్ చికెన్ ఎదుగుదల కోసం కలిపిన రసాయనం. బర్డ్ ఫ్లూ బ్రాయిలర్ చికెన్ వల్ల వస్తుంది. ఇది పురుషుల సంతానోత్పత్తిని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ చికెన్‌లో చెడు కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల అధిక రక్తపోటు, గుండె సమస్యలు వంటి అనేక సమస్యలు వస్తాయి.