సరదాగా చూయింగ్ గమ్ నములుతున్నారా..? అది ఎంత ప్రమాదమో తెలుసుకోండి.
చూయింగ్ గమ్ నమలడం వల్ల నష్టాలున్నాయా.. లాభాలున్నాయా.. అనే విషయంపై పరిశోధనలు చేసి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. చూయింగ్ గమ్ నమలడం వల్ల కేలరీలు ఖర్చువుతాయి. అది కూడా కేవలం షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని చెబుతున్నారు నిపుణులు. షుగర్ ఫ్రీ చూయింగమ్ ను గంట నమిలితే టకు 11 కేలరీలు ఖర్చవుతాయని వెల్లడైంది. అయితే దంతాల ఆరోగ్యం కోసం చూయింగ్ గమ్ నమలడం మంచిదే అని అంటుంటారు.
అయితే ఎక్కువ సమయం పాటు నోట్లో చూయింగ్ గమ్ నమలడం వల్ల దంతక్షయం, దవడ ఆరోగ్యానికి కూడా నష్టం జరగవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చూయింగ్ గమ్ ఉండడం వల్ల నోరు ఎప్పుడూ లాలాజలంతో నిండి ఉంటుంది. అది కావిటీల నుంచి రక్షిస్తుంది. అయితే ఆ చూయింగ్ గమ్ షుగర్ ఫ్రీ అయ్యి ఉండాలి. ఎక్కువ లాలా జలంతో నోరు తడిగా ఉంటే దంతాల మధ్య ఇరుక్కున్న ఆహార కణాలు తొలగిపోతాయి. అందువల్ల దంతక్షయం ప్రమాదం తగ్గుతుంది. చూయింగ్ నమలడం వల్ల కలిగ నష్టం కంటే లాభమే ఎక్కువ అనే వాదన ఉంది.
అయితే, ఇప్పటివరకు మనకు కూడా ఇదే తెలుసు. తాజా వాదనల ప్రకారం.. చూయింగ్ గమ్ వల్ల సమస్యలు కూడా వస్తాయట. మీకు చూయింగ్ గమ్ నమిలిలే అలవాటు ఉంటే.. ఒక పరిమిత సమయాన్ని పాటించాలని దంత వైద్య నిపుణులు చెబుతున్నారు. గరిష్టంగా 15 నిమిషాలకు మించి నమలాడాన్ని సిఫారసు చేయకూడదని అంటున్నారు. అదే పనిగా గంటల పాటు నములుతుంటే దంతాల చుట్టూ ఉంటే ఎనామిల్ డీమినలలైజేషన్ కి గురవుతుందని, ఫలితంగా దంతాలు చాలా సులభంగా దంతక్షయానికి గురికావచ్చేనేది నిపుణుల వాదన.
ఎక్కువ సమయం పాటు చూయింగ్ గమ్ నమలడం వల్ల టెంపోరోమ్యాండిబ్యులర్ కీళ్ల మీద మరింత భారం పడి పుర్రెకు దవడను కలిపే కీలు దెబ్బతినవచ్చు. నమలడానికి, మాట్లాడటం, ఆవలించడం, మింగడం వంటి రకరకాల పనులను చేసే ఈ కీలే. చూయింగ్ గమ్ వల్ల వెంటనే ఈ సమస్య రాకపోవచ్చు. కానీ ఇప్పటికే కీలులో గాయం ఉన్నవారికి సమస్య తీవ్రం కావచ్చు. ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్ వంటి ఇతర ఎముకలు, కీళ్ల సమస్యలతో బాధ పడేవారిలో కూడా చూయింగ్ గమ్ ఎక్కువ సమయం పాటు నమలడం వల్ల సమస్యలు రావచ్చు.
గమ్ నమలాలని అనుకుంటే షుగర్ ఫ్రీ రకాలు మాత్రమే వాడాలి. జిలిటాల్ లేదా సార్బిటాల్ వంటి స్వీటనర్లు కలిగి ఉన్నవి మంచివని నిపుణులు సూచిస్తున్నారు. ఇక నుంచి చూయింగ్ గమ్ తినాలనుకుంటే కొన్ని నిబంధనలు గుర్తుపెట్టుకోవడం ఎందుకైనా మంచిది. అది షుగర్ ఫ్రీ అయ్యి ఉండాలి. అంతే కాదు 15 నిమిషాలకు మించి నమలకూడదని గుర్తుంచుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తూ గమ్ నమిలే అలవాటును కొనసాగించవచ్చు.