ఛాతీలో నొప్పికి , గ్యాస్ తో వచ్చే నొప్పికి మధ్య తేడాలు ఎంతో తెలుసా..?
చాతీ భాగంలో అసౌకర్యంగా ఉంటుంది. అయితే ఇది గ్యాస్ అని చాలామంది లైట్ తీసుకుంటారు. అయితే గ్యాస్ లేకపోతే హార్ట్ ఎటాక్ ఇంతే తెలుసు.. కానీ ఈ భాగంలో నొప్పి అనేది ఇంకా చాలా సమస్యలకు సంకేతం. అయితే గ్యాస్టిక్ సమస్య వల్ల కూడా గుండెల్లో మంటగా అనిపిస్తుంది. ఛాతీలో నొప్పి వస్తుంది. పొట్టలోని గ్యాస్ట్రిక్ ఆమ్లాలు ఎసిడిటీని కలిగిస్తాయి. ఛాతీ దగ్గర్లో మంటని కలిగిస్తాయి. ఈ పరిస్థితిని గ్యాస్ట్రోఈసోఫజెల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటారు. దీనిని ఇలాగే వదిలేస్తే ఆస్తమాకు, ఇతర సమస్యలకు దారి తీస్తుంది.
గ్యాస్ కారణంగా ఛాతీలో ఎడమవైపు నొప్పిగా ఉంటుంది. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. పుల్లని త్రేన్పులు ఎక్కువగా వస్తుంటాయి. గుండెల్లో మండుతున్నట్లు భావన కలుగుతుంది. గ్యాస్ నొప్పి మనం వేలుతో పాయింట్ చేసేంత ప్లేస్‌లోనే ఉంటుంది. అది కూడా ఓసారి ఒక దగ్గర ఇంకోసారి ఇంకో దగ్గర ఉంటుంది. ముందుకు వంగి నప్పుడు కూర్చున్నప్పుడు ఛాతీలో ఉండే నొప్పి పడుకున్నప్పుడు వీపు భాగంలో ఉంటుంది.
అదే గుండె నొప్పి వచ్చినట్లయితే పడుకున్నా లేచినా నొప్పి ఒకేచోట ఉంటుంది. గుండె నొప్పి ఛాతీతో పాటు ఎడమ చెయ్యి ఎడమ వైపు బ్యాక్ అంతా ఒకేసారి నొప్పి కనిపిస్తుంది. ఛాతీ భాగం బరువుతో కూడిన నొప్పిని కలిగిస్తుంది. అలాగే, విపరీతమైన చెమట వస్తుంది. కొందరిలో అనుకోకుండా వాంతులు, విరేచనాలు అవుతుంటాయి. ఇలా గ్యాస్ సమస్య కారణంగా ఛాతీలో మంటగా ఉన్నప్పుడు పల్చటి మజ్జిగ రెండు గ్లాసులు తీసుకుంటే సరిపోతుంది.
అలా కూడా తగ్గనిపక్షంలో గ్లాసెడు నీటిలో ఈనో కలుపుకుని తాగితే ఫలితం ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే బీరకాయ కూర తినాలి. పరిగడుపునే గ్లాసెడు నీటిలో అర చెంచా జీలకర్ర వేసి మరిగించి చల్లార్చి తాగడం అలవాటు చేసుకోవాలి. అంతే కాకుండా.. బాగా బరువులు ఎత్తినప్పుడు కూడా ఛాతీలో నొప్పి వస్తుంది. ఊపిరితిత్తుల సమస్య ఉన్నప్పుడు కూడా గుండె నొప్పిగా ఉంటుంది. ఊపిరితిత్తుల భాగంలో వాపులాంటివి వస్తే ఛాతీలో నొప్పిగా అనిపిస్తుంది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కూడా ఛాతీ నొప్పికి కారణమవుతుందని కూడా గుర్తుంచుకోవాలి.