రోడ్డు పక్కన చెరుకు రసం తాగుతున్నారా..? ఈ విషయాలుమీకు తెలిస్తే..?
చెరకు రసం రుచికరమైన ,సూర్యరశ్మికి అనుకూలమైన శీతల పానీయం మాత్రమే కాదు. ఇది ఐరన్, ఎలక్ట్రోలైట్స్ ,యాంటీ ఆక్సిడెంట్స్‌తో కూడిన పోషకాలతో నిండి ఉంటుంది. ఏదైనా సీసా లేదా ప్యాకెట్‌లో వచ్చే పానీయాలు తాజాగా తయారు చేసిన చెరకు రసానికి సరితూగవు. అయితే చెరుకు రసంలో వున్న ఔషద గుణాలు ఏమిటో ఎక్కువ మంది కి తెలియకపోవచ్చు.. ఈ చెరకు రసం క్రమేపీ తాగడం వలన లేదా ఒక పద్దతి ప్రకారం తాగడం వలన మనలో యే జబ్బులు పోతాయి.
ఈ చెరుకు రసంలో విటమిన్ బి, సి, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, క్యాలిషియం కూడా వుంది. చెరకు రసం తాగడం వల్ల తక్షణ శక్తి వస్తుం.ది ఎందుకంటే దీనిలో సహజ సిద్ధమైన గ్లూకోజ్ కలిగి వుండడం వలన వెంటనే శక్తి లభిస్తుంది. ఈ చెరకు రసంలో కొంచెం అల్లం ముక్క వేసి , కాస్త నిమ్మరసం పిండుకొని తాగితే జీర్ణ శక్తి, ఆకలి కూడా పెరుగుతుంది. చెరకు రసం తరచుగా తాగడం వల్ల రక్తహీనత తగ్గుతుంది మరియు మూత్రపిండ వ్యాధులు కూడా నయం అవుతాయి.
చెరకు రసం తరచుగా తాగడం వల్ల మలం లేదా మూత్రంలో అయ్యే రక్తస్రావాన్ని అరికడుతుంది ఉత్తేజాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా ముక్కు నుంచి రక్తస్రావం అయ్యెప్పుడు చెరకు రసం తాగిన లేదా రెండు చుక్కలు ముక్కులో వేసిన తగ్గిపోతుంది.ఇంకా మనం చూసినట్లయితే చెరకురసం తాగడం వల్ల వాతం,పిత్తం వంటి రోగాలు మరియు కళ్ళు ఎర్రగా గానీ కళ్ళు నొప్పులతో బాధపడేవారికి రెండు చుక్కలు వేసిన తగ్గుతుంది.
చెరకు రసం తరచుగా తాగితే మొలలు వున్న వారికి మరియు ఉబ్బసం మరియు గ్యాస్ వలన ఏర్పడే శబ్దాలను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది.చర్మం కూడా నిగా నీగా లాడుతోంది. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే, లివర్ కి సంబందించిన వ్యాధులు నయం చేస్తుంది.చెరకు రసంలో 15 శాతం చక్కెర వుంటుంది అందుకే డయాబెటిస్ వున్న వారు తాగక పోవడమే మంచిది కాబట్టి ప్రతి ఒక్కరూ కనీసం రోజుకి ఒక గ్లాస్ అయిన ప్రయతించండి.