అంబానీ కొడుకు ప్రీ వెడ్డింగ్ వేడుకలకు టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ ని మాత్రమే ఎందుకు పిలిచారో తెలుసా..?
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు రామ్‌చరణ్ అటెండ్ కాబోతున్నాడు. తన సతీమణి ఉపాసనతో కలిసి ఈ పెళ్లి వేడుకల్లో పాల్గొననున్నాడు. శుక్రవారం ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం శుక్రవారం రామ్‌చరణ్, ఉపాసన జామ్ నగర్ వెళ్లనున్నట్లు తెలిసింది. టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ మాత్రమే అనంత్ పెళ్లి వేడుకలకు హాజరుకాబోతున్నట్లు సమాచారం. రామ్‌చరణ్‌తో పాటు షారుఖ్‌ఖాన్ తన భార్య పిల్లలతో అనంత్ అంబానీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో పాల్గొననున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న టాపిక్.. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు, స్టార్లు ఈ వేడుకకు హాజరయ్యారు. ఆడుతూ, పాడుతూ ఎంతగానో ఎంజాయ్ చేశారు. క్రికెటర్లు, బిజినెస్ టైకూన్స్, వరల్డ్ ఫేమస్ సింగర్స్, బాలీవుడ్ స్టార్స్, సోషల్ యాక్టివిస్ట్స్ ఇలా ఎంతో మందికి ఆహ్వానం అందింది.
అయితే టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ కు మాత్రమే ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ఆహ్వానం దక్కినట్లు తెలుస్తోంది. చెర్రీ దంపతులు మాత్రమే టాలీవుడ్ నుంచి ఆ వేడుకల్లో మెరిశారు. అందరూ ఇప్పుడు ఎందుకు కేవలం రామ్ చరణ్ కు మాత్రమే ఆహ్వానం దక్కింది అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ అది రామ్ చరణ్ ఒక్కడికి మాత్రమే దక్కిన ఆహ్వానం కాదు.. మొత్తం టాలీవుడ్ కు దక్కిన గౌరవం అది.
టాలీవుడ్ కి ప్రాధాన్యం ఇస్తూ రామ్ చరణ్ కు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. అంబానీ ఫ్యామిలీ అన్ని రంగాల నుంచి టాప్ సెలబ్రిటీలకు ఆహ్వానాలు పంపాయి. అక్కడున్న తారలను పరిశీలించినా కూడా ఆ విషయం స్పష్టమవుతుంది. అలాగే టాలీవుడ్ ని గౌరవిస్తూ ముఖేశ్ అంబానీ రామ్ చరణ్ కు ఆహ్వానం పంపారు. ఇది కేవలం రామ్ చరణ్ జంటకు దక్కిన గౌరవం మాత్రమే కాదు.. టాలీవుడ్ ఇండస్ట్రీకి దక్కిన గుర్తింపు, గౌరవంగా భావించాలి.