బిగ్ షాక్, కుమారీ ఆంటీపై పోలీస్ కేసు నమోదు, కుమారి ఆంటీ బిజినెస్ క్లోజ్..?
మీమర్స్, యూట్యూబర్స్, సెలబ్రిటీల పుణ్యమా అని ఆవిడ బిజినెస్ రెండింతలు అయ్యింది. అయితే ఆ పుణ్యం ఎక్కువ రోజులు నిలబడలేదు. అదే చివరికి శాపంగా మారి.. చివరకి ఆమె ఫుడ్ స్టాల్ కూడా పెట్టుకునే పరిస్థితి లేకుండా చేసింది. అక్కడితో ఆగినా బాగుండేదేమో.. ఇప్పుడు ఆ పబ్లిసిటీ కాస్తా కుమారీ ఆంటీ మీద కేసు కూడా పెట్టే పరిస్థితికి తీసుకెళ్లింది. అయితే ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుండటంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.
కుమారీ ఆంటీపై కేసు నమోదు చేసి, ఆమె నిర్వహిస్తున్న ఫుడ్ వ్యాన్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిపోయారు. దీంతో ఆమె వ్యాపారానికి బ్రేక్ పడింది. ఏ సోషల్ మీడియా ద్వారా అయితే కుమారి ఆంటీ ఫేమస్ అయ్యారో.. అదే సోషల్ మీడియా వల్ల ఆమె బిజినెస్ క్లోజ్ అయ్యింది. కుమారి ఆంటీ వ్యాపారం మూతపడటం ఎంత సంచలనంగా మారింది అంటే.. ఏకంగా రాజకీయ కారణాల వల్లే ఆమె బిజినెస్ క్లోజ్ చేశారనే ప్రచారం సాగుతోంది సోషల్ మీడియాలో.
ఆమెకు వైసీపీ ప్రభుత్వం అండ ఉండటం వల్లనే.. కావాలనే కక్షగట్టి వ్యాపారం మూతపడేలా చేశారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కుమారీ ఆంటీ మీద కేసు నమోదైతే.. అందులోకి రాజకీయ కారణాలు ఎందుకు వచ్చాయి అంటే.. గతంలో ఓ సారి కుమారి ఆంటీ మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం వల్లే తమకు ఇల్లు వచ్చిందని చెప్పింది. అదిగో ఆ మాట పట్టుకుని.. ఇప్పుడు ఈ విషయాన్ని రాజకీయాలతో ముడిపెడుతున్నారు కొందరు నెటిజనులు. రాజకీయ కారణాల వల్లే ఆమె షాప్‌ను క్లోజ్ చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు.