కార్డియాక్ అరెస్ట్ వచ్చే గంట ముందు కనిపించే లక్షణలు ఇవే.
కార్డియాక్ అరెస్ట్‌లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. తీవ్రమైన ఛాతీ నొప్పి, మైకము, పల్స్ లో క్రమంగా తగ్గుదల ఏదైనా ఆలోచించడానికి లేదా అర్థం చేసుకోవడానికి బ్రెయిన్ పనిచేయకపోవడం జరుగుతాయి. కార్డియాక్ అరెస్ట్ సమయంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోతాడు. అయితే హఠాత్తుగా గుండెపోటు వచ్చి కుప్పకూలి మరణించడం వంటి కేసులు ఇటీవల కాలంలో పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
గుండెలోని రక్త నాళాల్లో రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడటం, రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండె పోటు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. గుండె పోటు వచ్చే అరగంట లేదా అంతకంటే ముందు ఛాతీలో నొప్పి మొదలవుతుంది. సాధారణంగా ఎడమ చేతివైపు నొప్పి వస్తుంది.
వెనువెంటనే విపరీతంగా చెమటలు పడతాయి. కడుపులో గ్యాస్ పెరిగినట్లు, ఛాతిపై ఒత్తిడి పేరుకున్నట్లు, గొంతులో ఏదో ఇరుక్కుపోయినట్లు ఉంటుంది. ఆ తర్వాత శరీరం స్వాధీనం తప్పినట్లు, అలసటగా అనిపిస్తుంది. గుండె నుంచి వెన్నువైపుగా నొప్పి కదులుతున్నట్లు అనిపిస్తుంది. దీన్ని నడుం నొప్పిగా భావించకూడదు.
వెంటనే ఈ లక్షణాలను మనం గుర్తించకపోతే గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి గుండెపోటు వచ్చే వారిలో కేవలం 3 నుంచి 8 శాతం మంది మాత్రమే బతికి బయటపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ మీ కుటుంబంలో ఎవరికైనా 30 లేదా 40ల వయసులో ఒక్కసారిగా గుండె పోటుతో మరణిస్తే. వెంటనే కుటుంబంలో మిగతా అందరూ హృద్రోగ పరీక్షలు చేయించుకోవడం మరచిపోకూడదు.