Health

ఈ లక్షణలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు, అది క్యాన్సర్ సంకేతాలు కావొచ్చు

క్యాన్సర్ అనేది శరీరంలోని ఓ అవయవానికి, కణజాలంలో మొదలయ్యే వ్యాధి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా జ‌నాల‌ను బ‌లితీసుకుంటున్న వ్యాధుల్లో క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారిది రెండో స్థానం. ఒక్క క‌ణ‌జాలంలో మొదలైన ఈ వ్యాధి అంతకంతకూ పెరుగుతూ శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలను పెంచుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు వందకు పైగా క్యాన్సర్‌ వ్యాధి రకాలను గుర్తించారు శాస్త్రవేత్తలు. అయితే క్యాన్సర్ పేరు వినగానే, చాలా మందికి గుండె గుభేల్‌ మంటుంది. క్యాన్సర్‌కు మందు లేదని ప్రజలు భయపడుతుంటారు.

కానీ, మనం సరైన సమయంలో లక్షణాలను గుర్తిస్తే క్యాన్సర్ నయం అవుతుందనేది మాత్రం అనేక సందర్భాల్లో రూజువవుతుంది. అన్ని రకాల క్యాన్సర్లు ప్రాణాంతకమైనవేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం, చాలా క్యాన్సర్లకు చికిత్స చేయవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, క్యాన్సర్ ప్రారంభ దశలో ఉన్న రోగులలో కొన్ని లక్షణాలు బయటపడుతుంటాయి. ఈ లక్షణాలను మనం ఎప్పుడూ విస్మరించకూడదు. క్యాన్సర్‌ను వీలైనంత త్వరగా గుర్తించవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అలా చేస్తే వ్యాధి నయం చేయడం సులభమవుతుందంటున్నారు. క్యాన్సర్ పేషెంట్ తొలిరోజుల్లో వేగంగా బరువు కోల్పోతాడు. ఎవరికైనా శరీర బరువు వేగంగా తగ్గుతూ ఉంటే, వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. క్యాన్సర్‌ రోగులు ప్రారంభ దశలో తరచుగా జ్వరాలతో బాధపడుతుంటారు. వారి రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా మారుతుంది. కొన్నిసార్లు జ్వరానికి కారణం తెలియదు. రాత్రిపూట విపరీతమైన చెమటలు పడుతుంటాయి. ఈ సంకేతం క్యాన్సర్ ప్రారంభ లక్షణాలుగా చెబుతున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. ఎక్కువ అలసటగా అనిపిస్తుంది. చిన్న చిన్న పనులకే అలసిపోతారు.

ఎక్కువ పని చేయలేరు.. ఎవరికైనా వయసుకు మించిన అలసట ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. శరీరంలో నొప్పి కూడా క్యాన్సర్ ప్రారంభ లక్షణమే, కారణం లేకుండా మీ శరీరంలో నొప్పిగా అనిపిస్తే, అది క్యాన్సర్ లక్షణం కావచ్చు. బోన్‌ క్యాన్సర్ నొప్పితో మొదలవుతుందని మీకు తెలుసా, కానీ మెదడు క్యాన్సర్ కూడా చాలా తలనొప్పిని కలిగిస్తుంది. చర్మం రంగులో మార్పు కూడా క్యాన్సర్ ప్రారంభ లక్షణాలలో ఒకటి. ఒక మోల్ లేదా దద్దుర్లు అకస్మాత్తుగా మీ చర్మంపై అభివృద్ధి చెందడం ప్రారంభిస్తే, చర్మంపై మచ్చలు ప్రారంభమైతే అది క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉందంటున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపించినవారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker