Health

గుండె జబ్బులున్నవారు ఈ కాలంలో మజ్జిగని అస్సలు తాగకపోవడం మంచిది.

వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో ఒక గ్లాసు మజ్జిగ మీ కడుపుకు మంచి ఉపశమనం కలిగించే పానీయం. లంచ్ లేదా డిన్నర్ తర్వాత దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా ఎసిడిటీని నివారిస్తుంది. ఈ అద్భుత పానీయం ప్రోబయోటిక్ గుణాలతో నిండి ఉంది, పెరిగుతున్న ఉష్ణోగ్రతల నుంచి మీ పేగు ఆరోగ్యాన్ని ఉన్నత స్థితిలో ఉంచుతుంది. అయితే వేసవి కాలంలో మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరాన్ని చల్లగా ఉంచడంతో పాటు పేగుల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ బి12, మినరల్స్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు మజ్జిగలో లభిస్తాయి. ఈ పోషకాలన్నీ మన శరీరంలోని అనేక సమస్యలను తగ్గిస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో మజ్జిగ అస్సలు తాగకూడదని మీకు తెలుసా. ఇలా చేయడం వల్ల మన శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. జలుబు, దగ్గు విషయంలో జాగ్రత్త.. జలుబు, దగ్గు లేదా గొంతు నొప్పితో బాధపడుతుంటే మజ్జిగ తీసుకోవడం వలన ఆరోగ్యానికి హానికరమవుతుంది.

మజ్జిగ శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. దీని కారణంగా సమస్య తగ్గడానికి బదులుగా పెరుగుతుంది. అంతే కాకుండా ఇలాంటి పరిస్థితుల్లో రాత్రిపూట కూడా మజ్జిగ తాగడం మానుకోవాలి. కిడ్నీ సమస్య..కిడ్నీ, ఎగ్జిమాకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే, ఈ పరిస్థితిలో కూడా మజ్జిగ తాగొద్దు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాల హాని కలుగుతుంది.

కిడ్నీ సంబంధిత సమస్యలుంటే వైద్యులను సంప్రదించిన తర్వాతే మజ్జిగ తీసుకోవాలి. గుండె రోగులు.. మజ్జిగలో సంతృప్త కొవ్వు పుష్కలంగా లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రోగులకు మజ్జిగ తీసుకోవడం ఆరోగ్యకరమైనది కాదు. హృద్రోగులు మజ్జిగ తాగితే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది వారికి ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

కీళ్ల నొప్పి..పెరుగుతున్న వయస్సుతో, ప్రజలు తరచుగా ఎముకల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలలో కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, కండరాల నొప్పి మొదలైనవి ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మజ్జిగ తీసుకోవడం మానేయాలి. ఇది కీళ్ల నొప్పులు, దృఢత్వాన్ని పెంచుతుంది. మజ్జిగ తాగే ముందు వైద్యుడిని సంప్రదించండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker