ఉదయాన్నే కాఫీలో నెయ్యి కలుపుకుని తాగితే ఎన్ని లాభాలున్నాయో తెలుసా..?
కాఫీలో కాఫీపొడి, పాలు, చక్కెర కలిపితే సరిపోవడం లేదు.. దీనికి వెన్న లేదా కొబ్బరినూనె కలిసి ఓ కొత్త రుచిని తయారు చేస్తున్నారు. దీన్ని బులెట్ ప్రూఫ్ కాఫీ గా విపరీతంగా ప్రాచుర్యం కూడా లభించింది. అయితే ఒక కప్పు కాఫీలో టీ స్పూన్ నెయ్యిని కలుపుకుని తాగితే ఎన్నో రోగాలు ఇట్టే తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సాంప్రదాయం ఇప్పటిదికాదు. కెఫిన్ కలిగిన పానీయాలకు వెన్నను జోడించే ఆచారం 7వ శతాబ్దం నుండి వస్తోందని చరిత్ర చెబుతుంది. టిబెటన్లు నెయ్యి కాఫీతో అధిక క్యాలరీ కంటెంట్, అనేక జీర్ణ ప్రయోజనాలు పొందుతున్నారు.
పెదవులు, ముఖాన్ని విపరీతమైన చలిలో పగిలిపోకుండా కాపాడుకునేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని నమ్ముతారు. డైరీ ఉత్పత్తుల సెన్సీవిటీ ఉన్నవారు సైతం దీనిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఈ కాఫీతో శక్తివంతంగా మారటంతోపాటు రోజంతా హుషారుగా గడుపవచ్చు. ముఖ్యంగా కాఫీ తాగితే చాలా త్వరగా బరువు తగ్గుతారు. బెల్లీ ఫ్యాట్ కూడా ఇది తగ్గించడానికి తోడ్పడుతుంది. నెయ్యిలో ఒమేగా3, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా అధికంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులతో రోజును ప్రారంభిస్తే ఆరోజంతా మీరు ఎనర్జిటిక్ గా ఉండటమే కాకుండా తినాలన్న కోరిక తగ్గుతుంది.
దీంతో బరువు తగ్గవచ్చు. ఇందులో కాల్షియం అధికంగా శరీరానికి అందుతుంది. దేశీ నెయ్యి తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తొందరగా కరిగిపోతుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఉదర సంబంధ సమస్యలు తగ్గుతాయి. కాఫీలో నెయ్యిని కలుపుకుని తాగితే జీర్ణప్రక్రియ మెరుగ్గా జరుగుతుంది. అంతేకాదు కాలేయ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణక్రియకు అంతరాయం కలిగించే ఆమ్లాన్ని తటస్తం చేస్తుంది. ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. కాఫీలో నెయ్యిని కలుపుకుని తాగితే నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అలాగే ఇది ఆహారాన్ని తొందరగా జీర్ణం చేస్తుంది.
నెయ్యిని కాఫీలో కలుపుకుని తాగితే గట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో బ్యూటిరేట్ అనే కొవ్వు ఆమ్లం కూడా ఉంది, ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. అధ్యయనాల్లో ఈ కాఫీ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని తేలింది. పెద్ద కప్పు కాఫీ కి, అర టీ స్పూన్ నెయ్యిని కలిపి కాఫీ నురుగు వచ్చే వరకు బీట్ చేయాలి. నెయ్యికి బదులుగా వెన్నను కూడా వేసుకోవచ్చు. కాఫీలో నెయ్యి కలుపటం వల్ల పోషకాలు ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాముల నెయ్యిలో మీరు మీ రోజువారీ సిఫార్సు చేసిన విటమిన్ ఎలో 61%, విటమిన్ ఇ 14% మరియు విటమిన్ కె 11% పొందుతారు.