News

చిత్ర పరిశ్రమలో విషాదం, కారు యాక్సిడెంట్‌లో ప్రముఖ నటి మృతి.

మంగళవారం స్నేహితురాలితో కలిసి వైభవి ఉపాధ్యాయ ప్రయాణిస్తున్న కారు హిమాచల్ ప్రదేశ్‌లో ప్రమాదానికి గురైంది. నిన్న మధ్యాహ్నం కారు ప్రమాదం జరిగింది. కారు ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. విషయం వెలుగులోకి రావడంతో నటి కుటుంబంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఉదయం ముంబైలో వైభవి ఉపాధ్యాయ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. వైభవి ప్రముఖ సీరియల్ సారాభాయ్ వర్సెస్ సారాభాయ్‌లో నటించింది. ఈ సీరియల్‌లోని జాస్మిన్ పాత్రతో 32ఏళ్ల వైభవి ఉపాధ్యాయ మంచి నటిగా పేరు తెచ్చుకుంది. అయితే చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది.

కారు ప్రమాదంలో బుల్లితెర నటి వైభవీ ఉపాధ్యాయ(32) మృతి చెందారు. తన తన భాయ్‌ఫ్రెండ్‌తో ప్రయాణం చేస్తున్న సమయంలో హిమాచల్‌ ప్రదేశ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వైభవికి ట్రావెలింగ్‌ అంటే చాలా ఇష్టం. తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మంగళవారం హిమాచల్‌ ప్రదేశ్‌కి వెళ్లింది.

తిరిగి వస్తున్న క్రమంలో తను ప్రయాణిస్తున్న కారు లోయలో పడింది. ఈ ప్రమాదంలో వైభవి మృతి చెందగా.. ఆమె బాయ్‌ఫ్రెండ్‌కు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. ఈ వార్త తెలియగానే వైభవి సోదరుడు హుటాహుటిన హిమాచల్‌ ప్రదేశ్‌కి బయలుదేరి వెళ్లాడు. నేడు ఆమె మృతదేహాన్ని ముంబైకి తీసుకురానున్నారు. ఈ రోజు సాయంత్రం వైభవి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆమె సన్నిహితులు తెలియజేశారు.

‘సారాభాయ్ వర్సెస్ సారాభాయ్‌’సీరియల్‌ ద్వారా వైభవీ ఫేమస్‌ అయింది. ఆ సీరియల్‌లోని జాస్మిన్ పాత్ర వైభవీకి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. దీపికా పదుకొణె నటించిన ఛపాక్‌ సినిమాలో కూడా వైభవి నటించింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker