Health

రొమ్ము కేన్సర్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే.

రొమ్ము క్యాన్సర్ సాధారణంగా మహిళల్లోనే ఎక్కువగా చూస్తుంటాం. అయితే మహిళల్లోనే కాదు పురుషుల్లో కూడా బ్రెస్ట్ కాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నప్పటీకి ప్రభావం మాత్రం చాలా త్రీవంగా ఉంటుంది. అయితే వేగంగా విస్తరిస్తోందిప్రపంచ వ్యాప్తంగా బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులు పెరిగిపోతున్నారు.

మన దేశంలోనూ వీరు సంఖ్య లక్షల్లోనే ఉన్నారు. ఓ అంచనా ప్రకారం మన దేశంలోని ప్రతి 1000 మంది మహిళల్లో ఇద్దరు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అయితే.. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. చాలా మంది మహిళలకు వారు బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వారికే తెలియదు కూడా. దీంతో వ్యాధి ముదిరేవరకూ అలానే ఉంటున్నారు. చివరికీ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. అలా కాకుండా వ్యాధి లక్షణాలు తెలుసుకుంటే చికిత్స పొందడం సులువవుతుంది.

వ్యాధి లక్షణాలుఛాతిపై ఉన్న చర్మం లోపలికి వెళ్లి… చర్మం సొట్టలు పడి ఉండడం గమనిస్తే రొమ్ము క్యాన్సర్ లక్షణంగా అనుమానించాలి. వక్షోజాలపై ఉండే చర్మ కణాల్లో మార్పులు వస్తుంటాయి, వాటిని గమనిస్తూ ఉండాలి. ఈ కారణంగా ఛాతిలో నొప్పిగా, అసౌకర్యంగా ఉంటుంది. ఈ లక్షణాలు గనుక ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఆరంభంలో ఉన్నట్లు గుర్తించాలి.బ్రెస్ట్ నిపుల్స్ చుట్టూ ఉండే చర్మం పొలుసులుగా మారి రాలిపోతుంది. రొమ్ము క్యాన్సర్ ఉంటే ఛాతిపై ఉన్న చర్మం రంగు మారుతుంది. శరీరంలోని ఇతర భాగాలపై ఉండే చర్మ కలర్ కన్నా భిన్నంగా ఉంటుంది.

ఇది గమనిస్తూ ఉండాలి.నిపుల్స్‌ని నొక్కితే అవి సరిగా లోపలికి వెళ్లకపోయినా, రెండు కూడా డిఫరెంట్ సైజ్‌లలో ఉన్నా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు అనుమానించాలి. బ్రెస్ట్ నిపుల్స్ నుంచి తెలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో ఏదైనా ద్రవం బయటకు వస్తుంటే అనుమానించాల్సిందే. కాలర్ బోన్స్, చంకల్లో ఉండే లింఫ్ గ్రంథుల్లో వాపు ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు భావించాలి. రొమ్ములు, చంకల్లో గడ్డలు ఉన్నట్లుగా అనిపించినా అనుమానించాలి. రొమ్ములపై చర్మం ముడతపడడం, గట్టిగా మారడం, రొమ్ములపై గుంటలు, నారింజ పండు రంగులోకి మారితే అనుమానించాల్సిందే.

ఈ లక్షణాలు చెక్ చేసుకోవాలిప్రతీ మహిళ కూడా ఎవరికీ వారే స్వయంగా చెక్ చేసుకోవచ్చు. పీరియడ్స్ స్టార్ట్ అయిన 6 వ రోజు అద్దం ముందు నిల్చోవాలి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ దిశలో అంటే సవ్య, అపసవ్య దిశలో రొమ్ములను పరీక్షించాలి.ఇలా పరీక్షించే సమయంలో మీకు ఏవైనా గడ్డల్లా తగిలితే ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలి.ముందుగానే రొమ్ము క్యాన్సర్ లక్షణాలను గుర్తించి.. చికిత్స తీసుకోవడం వల్ల సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker