వైద్యులు ఎక్కువగా బ్రౌన్ రైస్ తినమని ఎందుకు చెప్తారో తెలుసా..?
బ్రౌన్ రైస్ అనగానే ప్రత్యేకంగా వాటిని పండిస్తారని అనుకుంటారు చాలా మంది. కానీ కాదు. సాధారణ బియ్యాన్నే ప్రాసెస్ చేయకుండా అమ్మేవే బ్రౌన్ రైస్. ఇప్పుడు మనం తింటున్న వైట్ రైస్ బాగా రిఫైన్ చేసి, ప్రాసెస్ చేసిన బియ్యం. దీని వల్ల అవి సహజసిద్ధమైన ఆరోగ్యానికి మేలు చేసే గుణాలను కోల్పోతాయి. అయితే శరీరనికి కావాల్సిన చాలా రకాల పోషకాలుంటాయి.
కాబట్టి శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడమేకాకుండా.. దృఢంగా చేసేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా బరువును వేగంగా తగ్గిస్తుంది. క్యాన్సర్, వేగంగా బరువు పెరగడం, శరీరం నొప్పి, మధుమేహం మొదలైన సమస్యలు పాలిష్ చేసిన తెలుపు బియ్యం తినడం వల్ల వస్తున్నాయి. గుండెను దృఢంగా చేస్తాయి.. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్ తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.
వీటిని రోజూ తింటే.. గుండెపోటు, గుండె ఆగిపోవడం వంటి తీవ్రమైన వ్యాధులు అదుపులో ఉంటాయి. అంతేకాకుండా బరువు పెరగడం వంటి సమస్యలు దూరమవుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది.. బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పరిమాణాలు సులభంగా తగ్గుతాయి. అంతేకాకుండా కడుపులోని విష పదార్థాలు మలంలోంచి బయటకు వస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరచడానికి బ్రౌన్ రైస్ తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇందులో ఉండే మూలకాలు రక్తంలో చక్కెర పరిమాణాలను కూడా నియంత్రిస్తుంది. క్యాన్సర్ కణాలను నివారిస్తుంది.. క్యాన్సర్ సమస్యలకు చెక్ పెట్టేందుకు బ్రౌన్ రైస్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు క్యాన్సర్‌ను పూర్తిగా నివారిస్తాయి. కావున ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా బ్రౌన్ రైస్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.