బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి శుభవార్త చెప్పిన శాస్త్రవేత్తలు, కొత్త పద్ధతి కనిపెట్టిన పరిశోధకులు.
పిల్లలు మరియు యువత రేడియేషన్ కారణంగా బ్రెయిన్ ట్యూమర్ సమస్యకి గురవుతున్నారని డాక్టర్ చెప్పారు. అదే విధంగా అరుదైన జెనిటిక్ డిసార్డర్ కారణంగా కూడా బ్రెయిన్ ట్యూమర్ సమస్య చాలా మందిలో వస్తోందని చెప్పారు. అయితే మెదడుకు గాయాలు అయినప్పుడు తాత్కాలిక సమస్యలే కాకుండా కొన్నిసార్లు చాలా కాలం పాటు సమస్యలు వేధిస్తుంటాయి. మైల్డ్ ట్రమాటిక్ బ్రెయిన్ ఇంజురీ (mTBI) రోగులలో ఈ సమస్యలు కనిపిస్తుంటాయి. mTBI అంటే తల లేదా శరీరానికి దెబ్బ లేదా కుదుపు వల్ల కలిగే బ్రెయిన్ ఇంజురీ. దీనివల్ల లాంగ్ టర్మ్ సిమ్టమ్స్ వస్తే బతుకు భారం అవుతుంది. అయితే ఇలాంటి లక్షణాలకు చికిత్స చేయడానికి సౌండ్ థెరపీ బెస్ట్ ఆప్షన్ అంటోంది తాజా పరిశోధన.
మెదడు సంబంధిత సమస్యలను చికిత్సగా సౌండ్ వేవ్స్ ఎంత సమర్థవంతంగా పనిచేస్తాయో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఒక కొత్త అధ్యయనం చేపట్టారు. ఈ అధ్యయనంలో mTBIతో బాధపడుతున్న 106 మంది పార్టిసిపేట్ చేశారు. వీరికి తలనొప్పి, తల తిరగడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, మూడ్ చేంజెస్ వంటి సమస్యలు ఉన్నాయి. యూనిఫాండ్ సర్వీసెస్ యూనివర్సిటీ, వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్ పరిశోధకులు కలిసి చేపట్టిన అధ్యయనం ఫలితాలను అన్నల్స్ ఆఫ్ క్లినికల్ అండ్ ట్రాన్స్‌లేషనల్ న్యూరాలజీ జర్నల్‌లో ప్రచురించారు. బ్రెయిన్ ఎలక్ట్రికల్ యాక్టివిటీకు మ్యాచ్ అయ్యే ప్రత్యేక టోన్లను ప్లే చేయడం వల్ల మెదడు దానంతటదే నయం అవుతుందా? అనే విషయాన్ని పరిశోధకులు తెలుసుకోవాలనుకున్నారు.
ఆ మేరకు పార్టిసిపెంట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూప్ పార్టిసిపెంట్లు ఇండివిడ్యువల్ బ్రెయిన్‌వేవ్స్‌కు అనుగుణంగా ఉండే టోన్లను విన్నారు, మరొక గ్రూప్ పార్టిసిపెంట్లు సొంత బ్రెయిన్‌వేవ్స్‌కు సంబంధం లేని టోన్లను విన్నారు. రెండు గ్రూపులు 10 సెషన్లలో టోన్‌లను విన్నారు, ఒక్కొక్కటి 30 నిమిషాల పాటు కొనసాగింది. ఆ సమయంలో చీకటి గదిలో సౌకర్యవంతమైన కుర్చీలో కూర్చొని ఈ టోన్స్ విన్నారు. సింప్టమ్స్‌లో ఇంప్రూవ్‌మెంట్స్..పరిశోధకులు పార్టిసిపెంట్ల సింప్టమ్స్, బ్రెయిన్ ఫంక్షన్, హార్ట్ రేట్ వేరియబిలిటీని సెషన్‌లకు ముందు, తర్వాత నోట్ చేసుకున్నారు. పార్టిసిపెంట్ల స్లీప్ క్వాలిటీ, మూడ్, యాంగ్జైటీ లెవెల్స్ గురించి కూడా ఇది తెలుసుకున్నారు.
సెషన్లకు ముందు కంటే తరువాత రెండు గ్రూపుల సింప్టమ్స్‌లో భారీ ఇంప్రూవ్‌మెంట్స్ కనిపించాయని, ఈ మెరుగుదల కనీసం 6 నెలల పాటు కొనసాగిందని కనుగొన్నారు. అయితే బ్రెయిన్ ఫంక్షన్ లేదా హార్ట్ రేట్ వేరియబిలిటీ పరంగా గ్రూపుల మధ్య ఎలాంటి తేడాను కనుగొనలేదు. బ్రెయిన్‌వేవ్స్‌కు మ్యాచ్ అయ్యే స్పెసిఫిక్ టోన్లు ర్యాండమ్ టోన్‌ల కంటే పెద్దగా ప్రయోజనాలను అందించలేదని కూడా వారు తేల్చారు. బ్రెయిన్‌వేవ్-మ్యాచ్డ్ టోన్లు మెదడుపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయని ముందస్తుగా అంచనా వేసినందున పరిశోధకులు రిజల్ట్స్ చూసి ఆశ్చర్యపోయారు. రిలాక్సింగ్ ఎన్విరాన్‌మెంట్, రీసెర్చర్ల అటెన్షన్ లేదా ప్లేసిబో ఎఫెక్ట్ వంటి ఇతర కారణాల వల్ల కూడా సింప్టమ్స్ మెరుగుపడి ఉండొచ్చని అధ్యయనం అభిప్రాయపడింది.
డిఫరెంట్ రీజియన్స్ లేదా ఫ్రీక్వెన్సీస్ ప్రేరేపించడం ద్వారా ర్యాండమ్ టోన్లు బ్రెయిన్‌పై కొంత ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతాయని కూడా పరిశోధకులు సూచించారు. అకౌస్టిక్ స్టిమ్యులేషన్ ఎలా పని చేస్తుందో, దాని విజయానికి ఏ అంశాలు అవసరం అని అర్థం చేసుకోవడానికి మరింత పరిశోధన అవసరమని నిర్ధారించారు. పరిశోధనలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని చెప్పారు ప్రధాన పరిశోధకులు డాక్టర్ మైఖేల్ J రాయ్. పోస్ట్‌కాన్‌కస్సివ్ సింప్టమ్స్‌కు చికిత్స చేయడం చాలా కష్టం. మెదడు గాయాల నుంచి ప్రజలు కోలుకోవడానికి ఎకౌస్టిక్ స్టిమ్యులేషన్ అనేది కొత్త, సురక్షితమైన మార్గాన్ని అందించవచ్చు.