మెదడులో ఆ భాగాన్ని తినేస్తున్న కరోనా, డాక్టర్స్ ఏం చెప్పారో తెలుసా..?

మెదడులో ఆ భాగాన్ని తినేస్తున్న కరోనా, డాక్టర్స్ ఏం చెప్పారో తెలుసా..?

కరోనా సోకినవారిలో 15 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్టు స్టడీలో తేల్చారు. నిద్రపట్టకపోవడం, మెదడువాపు, స్ట్రోక్​, వాసన, రుచి కోల్పోవడం, కండరాలు, నరాల నొప్పులు, మూర్ఛ, గిలైన్​ బ్యారీ సిండ్రోమ్​, బ్రెయిన్​ ఫాగ్​, కన్ఫ్యూజన్​, మూడ్స్​ మారడం వంటి లక్షణాలు కనిపిస్తున్నట్టు గుర్తించారు. అయితే కరోనా మహమ్మారి ఒక్క శ్వాసకోశ వ్యవస్థపైనే కాదు.. శరీరంలోని అన్ని వ్యవస్థలపైనా ప్రభావం చూపిస్తోంది. మెదడుపైనా దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటోంది. కరోనా కారణంగా మన నాడీ వ్యవస్థలో కీలకమైన మెదడులోని నల్లటి పదార్థం (గ్రే మ్యాటర్) తగ్గిపోతోందని న్యూరాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.

కరోనా తీవ్రత ఎక్కువగా ఉండి వెంటిలేటర్ పై చికిత్స తీసుకున్నవారు, ఆక్సిజన్ అవసరం పడిన పేషెంట్లలో మెదడు ముందుభాగంలోని గ్రే మ్యాటర్ చాలా వరకు తగ్గిపోతోందని చెబుతున్నారు. అమెరికాలోని జార్జియా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు కరోనా నుంచి కోలుకున్న కొందరు పేషెంట్లపై అధ్యయనం చేసి ఈ నిర్ధారణకు వచ్చారు. మెదడులో సమాచారాన్ని క్రోఢీకరించడంలో గ్రే మ్యాటర్ ది కీలక పాత్ర. కదలికలు, జ్ఞాపకశక్తి, భావోద్వేగాలను నియంత్రించడంలో అది ముఖ్య పాత్ర పోషిస్తుంది.

ఇప్పటికే మెదడు సంబంధిత సమస్యలున్న వారు లేదా హైబీపీ, ఊబకాయం ఉండి కరోనా బారిన పడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తోందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ బి.ఎన్. గంగాధర్ చెప్పారు. కరోనా పేషెంట్లలో 15 శాతం మంది దాకా నాడీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని పరిశోధకులు గుర్తించారు. నిద్రలేమి, మెదడువాపు, స్ట్రోక్, వాసన, రుచి కోల్పోవడం, కండరాల నొప్పులు, మూర్ఛ, చపలచిత్తం, మూడ్స్ మారిపోవడం వంటి సమస్యలు వస్తున్నట్టు చెబుతున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *