ప్రజలను భయపెడుతున్న మరో వ్యాధి, నేరుగా మెదడును తినే సూక్ష్మజీవి.
నెగ్లెరియా ఫోవ్లేరి ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ వ్యాధి తొలిసారిగా 1937లో అమెరికాలో వెలుగు చూసింది. ఈ అమీబా సాధారణంగా మంచి నీటి సరస్సులు, నదులు, కాలువల్లో నివసిస్తుంటుంది. ఈ నీరు తాగినప్పుడు మెదడును చేరుకుని ఎటాక్ చేస్తుంది. అయితే ఇది నేరుగా మనిషి మెదడుపై దాడి చేసి వారిని చంపేస్తుంది. నెగ్లెరియా ఫోవ్లేరి గా పిలిచే ఈ అమీబా జాతికి చెందిన ఈ సూక్ష్మజీవి ప్రస్తుతం అమెరికా, ఇతర దేశాల ప్రజలను భయపెట్టిస్తోంది. చాలాకాలం పాటు ప్రచారంలో లేని ఈ వ్యాధి ఇది వరకు దక్షిణ అమెరికాలో మాత్రమే ప్రభావం చూపించేది.
ప్రస్తుతం క్రమంగా ఉత్తర అమెరికా అంతటా వ్యాపిస్తుందన్న పుకార్లు ప్రచారంలోకి వచ్చింది. కాగా, సెప్టెంబర్ 8న టెక్సాస్‌లోని హ్యుస్టన్ నగరం సమీపంలోని ఓ ఆరేళ్ల బాలుడు విపరీతమైన తలనొప్పి, వాంతులు తదితర లక్షణాలతో మృతి చెందాడు. ఆ బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా, అమీబా కారణమని తేలింది. దీంతో టెక్సాస్ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడి అధికారులు విపత్తు ప్రకటన జారీ చేశారు. ఈ ఘటనతో అమీబా మరోసారి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
దీనిపై విశ్లేషిస్తున్న సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, వాతావరణ మార్పులే ఇందుకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. మెదడు తినే అమీబా కాగా, వాతావరణ మార్పుల కారణంగా ప్రాణాంతకమైన మెదుడు తినే అమీబా క్రమ క్రమంగా మనిషి శరీరంలోకి వెళ్లినట్లు తేలింది. ఇది నాసిరక పొరల ద్వారా మనిషి శరీరంలోకి ప్రవేశించి మెదడులోకి చొచ్చుకుపోవడంతో విపరీతమైన తలనొప్పి, వాంతులు, మెడ పట్టేయడంతో పాటు చిరాకు, అలసట, మైకం, గందరగోళం, మతిమరుపు, భయం వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు స్పష్టం చేశారు.
కాగా, అమీబా సూక్ష్మజీవులు సాధారణంగా కాలువలు, చిన్న చిన్న మురికి గుంటలు, అపరిశుభ్రంగా ఉండే ప్రాంతాలు, తాగునీటి కుళాయిలు తదితర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అంతేకాకుండా ఇవి వెచ్చని మంచినీరు, మట్టిలో కూడా నివసిస్తున్నట్లు ఎమర్జింగ్ ఇన్ఫెక్లియోస్ డిసీజెస్ నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా చెప్పాలంటే అమీబా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుండటంతో కలుషితమైన నీటిలో ఈత కొట్టడం కూడా హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాచి చల్లార్చిన నీటినే తాగాలి ఈ సూక్ష్మక్రిమి ప్రభావం తీవ్రంగా ఉండటంతో కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని, స్నానానికి, వంట కోసం వీలైనంత వరకు కుళాయి నీటిని వాడకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే అమీబా వల్ల కలిగే వ్యాధిని ఎసెన్షియల్ అమేబిక్ మెనింగో ఎన్సెఫాలిటీస్ గా పిలుస్తారు. ఈ వ్యాధి వల్ల గత పదేళ్లలో అంటే 2010 నుంచి 2019 వరకు 34 సంక్రమణ కేసులు నమోదయ్యాయి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌తో పాటు వేసవి ఉండే నెలల్లో వ్యాధి సంక్రమణ ఎక్కువగా ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వ్యక్తి శరీరంలో అమీబా ఉనికిని గుర్తించడానికి ఇప్పటి వరకు ఎలాంటి పరీక్షలు రూపొందించబడనట్లు తెలుస్తోంది. దీంతో వ్యాధి నిర్ధారణకు మరిన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.