పొరపాటున కూడా బొప్పాయి పండుతో వీటిని కలిపి తినొద్దు. ఎందుకంటే..?
బొప్పాయి పండులోవున్నన్ని విటమిన్లు మరెందులోను లేవంటారు వైద్యులు. ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి తగు మోతాదులోనున్నాయి. అయితే బొప్పాయి చాలా మందికి ఎంతో ఇష్టమైన పండు. ఇది ఏడాది పొడవునా సులభంగా లభిస్తుంది.
బొప్పాయి పండులో చాలా పోషకాలు ఉన్నాయి. అందువల్ల ఇది అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బొప్పాయిలో యాంటీఆక్సిడెంట్లతో పాటు విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ లభిస్తాయి. ఐతే బొప్పాయి పండను కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తినకూడదు. అలా చేస్తే.. ఆరోగ్యానికి నష్టం చేకూరే అవకాశముంది. బొప్పాయి పండు ఆరోగ్యానికి మంచిదే. కానీ వీటిని నారింజ, నిమ్మ, పెరుగుతో పాటు తినకూడదు.
వీటితో పాటు బొప్పాయిని తీసుకుంటే.. పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. బొప్పాయి పండును నారింజతో కలిపి తినకూడదు. నారింజ పుల్లగా ఉంటుంది. బొప్పాయి తీపి. ఈ రెండూ ఒకదానికొకటి విరుద్ధంగా ఉండటం వల్ల… అతిసారం, అజీర్ణం వంటి సమస్యలు ఉండవచ్చు. చాలా మందికి బొప్పాయి చాట్ తినే అలవాటు ఉంటుంది.
ఇందులో నిమ్మకాయ వాడతారు. కానీ అలా చేయకూడదు. బొప్పాయితో నిమ్మకాయను తింటే.. రక్త సంబంధిత సమస్యలు వస్తాయి. రక్తహీనత వచ్చే ప్రమాదముంది. బొప్పాయితో పెరుగును పొరపాటు కూడా తినవద్దు. బొప్పాయి ఒంటికి వేడి చేస్తుంది. పెరుగు చలువ చేస్తుంది. అందుకే వీటిని కలిపి తీసుకోవడం వల్ల జలుబు, జలుబు, ఒళ్లు నొప్పుల సమస్యలు రావచ్చు.