Health

మీ పిల్లలకు ఈ ఆహారం పెడితే ఎముకలు బలంగా మారుతాయి.

ఎదిగే వయస్సులో వయస్సులో క్రమం తప్పకుండా పిల్లలకు పాలు ఇవ్వటం అనేది వారి శారీరక ఎదుగుదలకే కాకుండా ఎముకల గట్టితనానికి కూడా చాలా మంచిది. పాలలో కాల్షియం, జింక్,ప్రోటీన్,ప్యాట్,సుగర్,విటమిన్ ఎ,డి పుష్కలంగా లభిస్తాయి. అయితే సాధారణ జీవితంలో ఏ పని చేయాలన్నా.. ఎముకలు సహకరించకపోతే ఇబ్బందులు తప్పవు. అందుకే.. ఎముకలు అభివృద్ధి చెందే బాల్యంలోనే సరైన పోషకాలు శరీరానికి అందించాలి. బాల్యంలో ఎముకల ఆరోగ్యం పై ఎంత శ్రద్ధ వహిస్తే వృద్ధాప్యం అంత ఆనందంగా గడుస్తుంది.

ఏ వయసులో వారికైనా సరైన పోషకాలు లేకపోతే ఎముకల సంబంధిత సమస్యలు తప్పవు. పిల్లల ఎముకలు దృఢంగా ఉండాలంటే ఏం చేయాలో.. నిపుణుల సూచనల ద్వారా తెలుసుకోండి. విటమిన్ D ఎముకల ఆరోగ్య విషయంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఎముకల ఎదుగుదలకు ఇది అవసరం. కాల్షియంను గ్రహించడంలో శరీరానికి సహాయపడుతుంది. శరీరంలో విటమిన్ డి స్థాయిలు తగ్గడం వల్ల ఎముకల బలం తగ్గుతుంది. దానివల్ల వివిధ సమస్యలకు గురికావచ్చు.

ప్రతిరోజూ సూర్యరశ్మిలో కొంత సమయం గడపడం ద్వారా శరీరంలో విటమిన్ D స్థాయి పెరుగుతుంది. పిల్లలకు పెట్టే ఆహారంలో జున్ను, కాలేయం, కొవ్వుతో కూడిన చేపలు ఉండేలా చూసుకోండి. పాలు, పెరుగు, చీజ్ వంటి ప్రోడక్ట్స్‌లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల బలానికి నిర్మాణానికి అత్యంత ముఖ్యం. ఓ కప్పు పాలు, ఓ కప్పు పెరుగు రోజూ తింటే కాల్షియం అందుతుంది. పాల ఉత్పత్తులను కచ్చితంగా డైట్‌లో చేర్చుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు రోజూ పాలు, పెరుగు తీసుకునేలా చూసుకోవాలి.

అదనంగా పిల్లల ఆహారంలో బచ్చలికూర, కాలే(kale), ఓక్రా వంటి ఆకుపచ్చ కూరగాయలను తప్పనిసరిగా చేర్చండి. బలమైన ఎముకల ఎదుగుదలకు మెగ్నీషియం, కాల్షియం ఎంతో సహకరిస్తాయి. కాల్సిటోనిన్ అనే హార్మోన్‌ వృద్ధికి ఇది చాలా అవసరం. ఇది ఎముకల నిర్మాణాన్ని సంరక్షించడానికి మృదు కణజాలం నుంచి, రక్తం నుంచి ఎముకలకు కాల్షియంను అందిస్తుంది. పిల్లల ఆహారంలో మెగ్నీషియం అధికంగా ఉండే గోధుమలు, క్వినోవా, బాదం, వేరుశనగ, పచ్చి ఆకు కూరలు, నల్ల చిక్కుళ్ళు వంటివి చేర్చండి. విటమిన్ K అనేది పోషకాలకు పవర్‌హౌస్. ఇది ఆస్టియోకాల్సిన్ అనే ప్రోటీన్ పెంపొందిస్తుంది.

దీని ద్వారా ఆరోగ్యకరమైన ఎముక మాతృకను రూపొందించడానికి రక్తం నుంచి కాల్షియంను రవాణా చేస్తుంది. ఇది ఎముకల సాంద్రతను మెరుగుపరచడానికి కాల్షియంతో కలిసి పనిచేస్తుంది. పచ్చి ఆకు కూరలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, గుడ్లు, చేపలు,మాంసాహారం విటమిన్ K కి మంచి వనరులు. ఆటలు కూడా పిల్లల ఎదుగుదలకు ఎంతగానో సహకరిస్తాయి. శారీరక శ్రమ పిల్లల ఎముకలు బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. పిల్లల ఎముకలు, కండరాలను బలంగా ఉంచేందుకు రన్నింగ్, డ్యాన్స్, బాస్కెట్‌బాల్, టెన్నిస్, ఫుట్‌బాల్ ఇతర బరువులుతో కూడిన వర్కౌట్‌లలో చురుకుగా పాల్గొనేలా తల్లిదండ్రులు చూడాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker