యువతను ఎక్కువగా కబలిస్తోన్న వ్యాధి ఇదే. దానికి పరిష్కారం ఏంటంటే..?
చెడు జీవనశైలి కీళ్లపై ఒత్తిడిని తీసుకొస్తుంది. ఇది బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. ఎముకల సాంద్రత, ద్రవ్యరాశి తగ్గడం వల్ల బోలు ఎముకల వ్యాధి వస్తుంది. బలహీనమైన ఎముకలు పగుళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి. అయితే బోలు ఎముకల వ్యాధి. ఇంతకుముందు వరకు వయసు పైబడిన వారే దీని బాధితులు. ఇప్పుడు మన దేశానికి చెందిన యువత కూడా ఆ జాబితాలో చేరిపోతున్నారని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.
ఎముకలు బలహీనపడి పెలుసుబారడం ఈ వ్యాధి లక్షణం. ఆధునిక జీవన విధానం వల్ల దైనందిక జీవితంలో చోటు చేసుకుంటున్న మార్పులే ఇందుకు కారణమని చెప్పారు. భారత్ లోని యువతకు డీ విటమిన్, కాల్షియం అందకపోవడంతో ఈ వ్యాధి బారిన పడుతున్నారని పరిశోధకులు తెలిపారు. ఉదయాన్నే శరీరం మీద ఎండ పడేలా తిరిగితే ‘డీ’ విటమిన్ పొందవచ్చు. అలాగే, పాల ఉత్పత్తులు తీసుకుంటే కాల్షియం అందుతుంది.
ఈ రెండింటికీ యువతలో చాలా మంది దూరంగా ఉంటున్నారని పరిశోధకులు గుర్తించారు. దీని వల్ల మోకాళ్లు, కీళ్ల నొప్పుల వ్యాధులకు గురవుతున్నారని వివరించారు. కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం నుంచి కాల్షియం బయటికి వెళ్లిపోతుంది. కాబట్టి కాఫీ తక్కువగా తాగాలి. రోజుకు 4 కప్పుల కాఫీని తాగితే ఎముకలకు ఎటువంటి ప్రమాదం ఉండదు. అంతకంటే ఎక్కువగా తీసుకోకూడదు.
అదేవిధంగా కొన్ని అధ్యయనాలు ఎక్కువ సోడా తాగే వ్యక్తులు తక్కువ ఎముక ఖనిజ సాంద్రతను కలిగి ఉంటారని తేల్చారు. అందుకే సోడా తాగడం కూడా తగ్గించాలి. ఆల్కహాల్ శరీరం, ఎముకల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్థరైటిస్ అండ్ మస్క్యులోస్కెలెటల్ అండ్ స్కిన్ డిసీజెస్ ప్రకారం.. ఆల్కహాల్ వినియోగం శరీరంలో కాల్షియం, విటమిన్ డి శోషణ ప్రక్రియను దెబ్బతీస్తుంది. ఇది కాకుండా ఎక్కువ ఆల్కహాల్ తాగడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.ఎముకలు ఎక్కువ కాలం దృఢంగా ఉండాలంటే మంచి డైట్ పాటించాలి.