Health

శరీరానికి విటమిన్-D లోపించడం వల్ల ఎన్ని రోగాలు వస్తాయో తెలుసుకోండి.

శరీరంలో ఈ విటమిన్‌ కొరత ఉంటే అనేక సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఒక వేళా విటమిన్‌ కొరత సమస్యలతో బాధపడుతుంటే..శరీరం అలసిపోయినట్లు అనిపిస్తుంది. అంతేకాకుండా వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడతారు. ఈ లోపం వల్ల గుండె సంబంధిత సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, మధుమేహం వంటి వ్యాధులు రావొచ్చు. అయితే శరీరానికి విటమిన్లు, ఖనిజాలు అన్నీ సక్రమంగా అందినప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. ఏ ఒక్కటి లోపించినా కూడా ఏదో ఒక సమస్య బయటపడుతుంది. చలికాలంలో ఎక్కువగా మంది విటమిన్-D లోపంతో బాధపడతారు. కారణం సూర్యరశ్మి తగలకపోవడం. సూర్యకాంతి ద్వారా శరీరానికి తగినంత విటమిన్-D లభిస్తుంది.

కానీ చలికాలంలో దాన్ని పొందటం కొంచెం కష్టం అవుతుంది. అందువల్లే ఎక్కువ మంది ఈ లోపంతో బాధపడతారు. విటమిన్ డి కొవ్వులో కరిగే విటమిన్. ఇది లోపించడం వల్ల గుండె జబ్బులు మాత్రమే కాదు కండరాలు కూడా బలహీనంగా మారిపోతాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ఎముకలు, దంతాలు బలంగా ఉండేందుకు ఈ విటమిన్ చాలా అవసరం. కానీ ఈ విటమిన్ లోపం వల్ల కండరాల నష్టం వేగంగా ఉంటుందని కొత్త అధ్యయనం చెబుతోంది. సాధారణంగా వయస్సు మళ్లిన వారిలో కండరాలు బలహీనంగా మారడం జరుగుతుంది. కానీ విటమిన్ డి లోపం వల్ల అది మరింత ఎక్కువగా ఉంటుందని తేలింది.

కాల్సిఫైడ్ టిష్యూ ఇంటర్నేషనల్, మస్క్యులోస్కెలెటల్ రీసెర్చ్‌లో ఈ అధ్యయనం నిర్వహించింది. 50 సంవత్సరాలు పైబడిన దాదాపు 3205 మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. నాలుగేళ్ల పాటు జరిగిన ఈ అధ్యయనంలో విటమిన్ డి లోపంతో బాధపడుతున్న వ్యక్తుల్లో కండరాల బలహీనత 70 శాతం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకునే వాళ్ళు, బోలు ఎముక వ్యాధి రోగులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ విటమిన్ లోపం వల్ల ఎముకలకే కాదు గుండెకి కూడా నష్టం వాటిల్లుతుంది. దీన్ని ఆహార పదార్థాల కంటే సూర్యరశ్మి ద్వారా పొందటం సులభం.

విటమిన్ డి అందించే ఆహార పదార్థాలు.. పుట్ట గొడుగులు, పాలు, గుడ్లు, సాల్మన్, సార్డినెస్ చేపలు, కాడ్ లివర్ ఆయిల్, విటమిన్ డి ఎముకలని బలోపేతం చేస్తుంది. కండరాలు బలహీనంగా మారకుండా కాపాడుతుంది. ఇవి రెండు వయస్సు పైబడే కొద్ది జరుగుతాయి. కండరాలు ధృడంగా ఉంచుకునేందుకు మార్గాలు ఉన్నాయి. అవేంటంటే..విటమిన్ డి ఉండే ఆహారాన్ని తినడం, తగినంత కాల్షియం పొందటం, సాల్మన్, చికెన్, టర్కీ వంటి లీన్ ప్రోటీన్లు తీసుకోవడం, క్రమం తప్పని వ్యాయామం. 71 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు రోజుకి 800 IU విటమిన్ డి పొందాలి. మిగతా వాళ్ళు రోజుకి 600 IU పొందేలా చూసుకోవాలి.

విటమిన్-డి లోపం వల్ల కొందరు విపరీతంగా బరువు పెరిగిపోతారు. మరికొందరిలో ఒత్తిడి, ప్రోస్టేట్ క్యాన్సర్, కొలోన్ క్యాన్సర్ వంటి సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి.. శరీరానికి సూర్యరశ్మి తగిలేలా జాగ్రత్తపడటమే కాకుండా, మీరు తీసుకొనే ఆహారంలో కూడా విటమిన్-డి ఉండేలా డైట్ ప్లాన్ చేసుకోవాలి. వ్యాయామం కూడా తప్పనిసరి. స్త్రీలు, వృద్ధులు రెగ్యులర్‌గా విటమిన్-డి స్క్రీనింగ్ చేయించుకోవడం ముఖ్యం. మనం తీసుకునే ఆహారంలోని పోషకాలను, కాల్షియాన్ని శరీరం గ్రహించాలంటే విటమిన్-డి అవసరమవుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker