Health

శరీరానికి తక్షణ శక్తి కోసం ఖచ్చితంగా తినాల్సిన పండు ఇదే, తినే ముందు ఒకసారి..?

మన శరీరంలో ఏర్పడే అధిక రక్తపోటును నియంత్రించడానికి కూడా పైనాపిల్ ఎంతో కీలకపాత్ర వహిస్తుంది. పైనాపిల్ లో ఉండే బ్రొమిలైన్‌ అనే ఎంజైమ్‌ క్యాన్సర్ పేషెంట్లలో కలిగే దుష్ప్రభావాలను దూరం చేస్తుంది. ఇటీవల పరిశోధనలలో భాగంగా పైనాపిల్ లోని బీటా-కెరోటిన్‌.. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ నుంచి రక్షిస్తుందని వెల్లడయింది. అయితే పైనాపిల్ ఎండాకాలంలో తినడానికి అనువైన పండు. పైనాపిల్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. పైనాపిల్ యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం.

దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. పైనాపిల్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే మన రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పైనాపిల్ లో బ్రోమెలైన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుందని, ప్రాణాంతకమైన రోగాల నుంచి రక్షిస్తుందని, మంటను తగ్గిస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

పైనాపిల్ లో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ బి 6, కాపర్, థయామిన్, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, నియాసిన్, పాంతోతేనిక్ ఆమ్లం, రిబోఫ్లేవిన్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. పైనాపిల్ లో ఫాస్పరస్, జింక్, కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ కె కూడా పుష్కలంగా ఉంటాయి. పైనాపిల్ విటమిన్ సి కి గొప్ప వనరు. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఈ పోషకం బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. విటమిన్ సి, విటమిన్ ఎ పుష్కలంగా ఉన్న పైనాపిల్ పండులో 452 కేలరీలు, 119 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 13 గ్రాముల ఫైబర్, 5 గ్రాముల పోటిన్లు ఉంటాయి. పైనాపిల్ యాంటీ ఆక్సిడెంట్లకు గొప్ప మూలం. ఇది గుండె జబ్బులు, డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్లు వంటి రోగాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఎన్నోఅధ్యయనాలు పైనాపిల్ లోని బ్రోమెలైన్ తో సహా సమ్మేళనాలు ఆక్సీకరణ ఒత్తిడిని, మంటను, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని సూచిస్తున్నాయి. పైనాపిల్ ను బ్రేక్ ఫాస్ట్ గా లేదా ఈవెనింగ్ స్నాక్స్ గా తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి కూడా పైనాపిల్ ఎంతో మేలు చేస్తుంది. పైనాపిల్ లో ఫైబర్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది బరువు తగ్గడానికి కూడా ఎంతో సహాయపడుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker