బోడ కాకరతో బోలెడన్ని అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.ఒక్కసారి తిన్నారంటే..?
ఆకాకర కాయలు జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేసేందుకు ఎంతగానో తోడ్పడతాయి. వంద గ్రాముల ఆకాకరకాయ ముక్కల్లో చాలా తక్కువ సంఖ్యలో కెలొరీలుంటాయి. పీచూ, విటమిన్లూ, యాంటీఆక్సిడెంట్లూ అధికంగా లభిస్తాయి. అయితే ఆకాకర కాయ, బోడ కాకర కాయ, ఆగాకర కాయ అని పిలిచుకునే ఈ కాయగూర సీజన్ రాబోతోంది. ఇప్పటి నుంచి వినాయక చవితి వరకు మార్కెట్లో లభ్యమవుతుంది. ఆకాకర కాయలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ కూరగాయలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. బోడ కాకర కాయలో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. ఇది కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్. విటమిన్ ఎ కళ్ళు దెబ్బతినకుండా కాపాడుతుంది. రేచీకటిని నివారించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. ఆకాకరలో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతాయి.
ఫ్రీ రాడికల్స్ అస్థిర అణువులు. ఇవి కణాలను దెబ్బతీస్తాయి. వ్యాధులను కలుగజేస్తాయి. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను తటస్తం చేయడానికి సహాయపడతాయి. అంటే రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతాయి. ఆకాకర కాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కాలేయం దెబ్బతినకుండా కాపాడుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.. ఆగాకర కాయలో హైపోగ్లైసీమిక్ లక్షణాలు ఉన్నాయి, అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
మధుమేహం లేదా ప్రీడయాబెటిస్ ఉన్న వారికి ఇది మంచి ఎంపిక. జీర్ణక్రియకు తోడ్పడుతుంది.. బోడ కాకర కాయలో ఫైబర్ బాగుంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యానికి మంచిది.. ఆకాకరలో ఉండే బీటా కెరోటిన్ శరీరంలో విటమిన్ ఎగా మారుతుంది.
విటమిన్ ఎ చర్మ ఆరోగ్యానికి అవసరం. సూర్యరశ్మి వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. క్యాన్సర్ నిరోధకంగా..బోడకాకరలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. ఒకరకంగా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.