Health

బొబ్బర్లతో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వెంటనే తినేస్తారు. మధుమేహాన్ని కూడా..?

మనకు ప్రకృతిలో సహజసిద్దంగా లభించే అలసందను బొబ్బర్లు అని కూడా అంటారు. అలసందలు రుచికరంగా మరియు మంచి ఫ్లేవర్‌ను కలిగి ఉంటాయి. అలసందల్లో వివిధ రకాల న్యూట్రీషియన్స్ కలిగి ఉండి మన శరీరంలో వివిధ రకాల జీవక్రియలకు సహాయపడుతాయి. అలసందలు తక్కువ క్యాలరీలు మరియు తక్కువ ఫ్యాట్ కలిగి ఉటుంది. బరువు తగ్గించడంలో మంచి ఆహారంగా సహాయపడుతుంది. అలసందల్లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

అందుకే బరువు తగ్గించడంలో ఇది ప్రధాన పాత్రను పోషిస్తుంది. వీటిని తినడం వల్ల మీ పొట్టనిండిన అనుభూతి కలుగుతుంది. అయితే అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారికి బొబ్బర్లు మంచి ఉప‌యోగ‌కర‌మైన ఆహారం. బొబ్బర్లలో క్యాల‌రీల‌తోపాటు కొవ్వులు కూడా త‌క్కువ‌గా ఉండ‌టంవ‌ల్ల బరువు తగ్గడానికి తోడ్పడుతాయి. వీటిలో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది.

ఈ ఫైబ‌ర్‌ అధిక‌ బరువును తగ్గించడంలో ప్రధానపాత్ర పోషిస్తుంది. మధుమేహుల‌కు లో-గ్లిజమిక్ ఇండెక్స్ కలిగిన బొబ్బర్లు చాలా ఆరోగ్యకరం. ఇవి బ్లడ్ షుగర్ స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతాయి. బొబ్బర్లలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని ఆహారంగా తీసుకోవ‌డంవ‌ల్ల పోష‌కాహార లోపంతో వ‌చ్చే కొన్నిరకాల వ్యాధులు ధ‌రిచేరవు.

ఇవి శరీరంలో వైరస్ వ్యాప్తి చెందకుండా హానికర టాక్సిన్స్‌ను నివారిస్తాయి. బొబ్బర్లు రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. అంతేగాక హృద‌య సంబంధ వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి. బొబ్బర్లలోని ఫ్లెవనాయిడ్స్, మినిరల్స్, పొటాషియం, మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి మంచివి. అదేవిధంగా బొబ్బర్లలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది.

మలబద్దకాన్ని నివారించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బొబ్బర్లలోని అధిక ప్రొటీన్‌ కంటెంట్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మ రంధ్రాలు తెరుచుకొనేలా చేస్తుంది. వాటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, సి చర్మ కణాలను రక్షిస్తాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker