రాత్రి ఎక్కువసేపు ఫోన్ చూస్తున్నారా..? ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకోండి.
బ్లూ లైట్అనేది సూర్యకిరణాల్లో కూడా ఉంటుంది. ఇది ‘హై ఎనర్జీ విజిబుల్ లైట్’. కంప్యూటర్, ల్యాప్‌టాప్, టీవీ, మొబైల్ ఫోన్ స్క్రీన్ల నుంచి కూడా బ్లూ లైట్ వస్తుంది. ఎక్కువ టైమ్ బ్లూ లైట్‌కి ఎక్స్పోజ్ అయితే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే వృద్ధాప్య ఛాయలు ముఖంపై కన్పించడం అనేది ఇటీవలి కాలంలో సర్వ సాధారణమైపోయింది. గతంలో జరిగిన చాలా అధ్యయనాల్లో దీనికి చాలా కారణాల్ని తేల్చారు. మొబైల్, ల్యాప్‌టాప్ వంటి గ్యాడ్జెట్స్ ప్రభావం కంటి వెలుగుపై పడుతుంది.
మానసిక ఆరోగ్యంపై చూపిస్తుంది. అదే సమయంలో ఏజీయింగ్ ప్రక్రియను కూడా ప్రభావితం చేస్తుంది. ఫ్రంటియర్ ఇన్ ఏజీయింగ్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక యానిమల్ మోడల్ అధ్యయనం ప్రకారం..స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్ వంటి గ్యాడ్జెట్స్ నుంచి వెలువడే బ్లూ లైట్ కారణంగా తక్కువ వయస్సుకే వృద్ధాప్య ఛాయలు కన్పిస్తున్నాయి.
టీవీ, ల్యాప్‌టాప్, ఫోన్ వంటి రోజూ ఉపయోగించే ఉపకరణాల్నించి వెలువడే బ్లూ లైట్‌కు ఎక్కువగా ప్రభావితమైతే..శరీరంలోని చర్మం, ఇతర సున్నితమైన భాగాలపై హానికారక ప్రభావం పడుతుంది. బ్లూ లైట్ కారణంగా ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. బ్లూ లైట్ అంటే ఏమిటి..బ్లూ లైట్‌ను హై ఎనర్జీ విజిబుల్ అని కూడా పిలుస్తారు.
ఇది ఓ రకమైన కాంతి. మనిషి కళ్ల నుంచి లైట్ స్పెక్ట్రమ్‌తో చూడవచ్చు. అందుకే మనిషి కంటితో ఆకాశం నీలంగా కనబబడుతుంది. ఎందుకంటే బ్లూ లైట్ వేవ్స్ మన వాతావరణంలో అల్లుకుని ఉంటాయి. దీర్ఘకాలంలో బ్లూ లైట్ ఎంతవరకూ హాని చేస్తుందనే విషయంపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. బ్లూ లైట్ కారణంగా ఏజియింగ్ ప్రక్రియపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.