Health

మీ బ్లడ్ గ్రూపు ఎదో చెప్పండి, మీరు ఎంత ప్రమాదమో ఉన్నారో తెలుస్తుంది.

1900 సంవత్సరం లో కారల్ ల్యాండ్ స్టీనర్ అను శాస్త్రవేత రక్త వర్గాలను కనుగొన్నాడు. రక్తాన్ని తీసుకొనే వ్యక్తిని గ్రహిత అని, ఇచ్చే వ్యక్తిని దాత అని అంటారు. ఆరోగ్యవంతులైన వ్యక్తులు 16- 50 సంవత్సరాల మధ్య వయసున్న(స్త్రీ, పురుషులిద్దరూ) రక్తదానం చేయవచ్చు.ఒక వ్యక్తి నుండి రక్తాన్ని ధమని నుండి తీసి మరో వ్యక్తికి సిరకు ద్వారా రక్తాన్ని ఎక్కిస్తారు.రక్తదానం చేసేటప్పుడు దాతకు అంటువ్యాధులు ఉండకూడదు.

వారికి హెపటైటిస్‌, ల్యుకేమియా, ఎయిడ్స్‌ మొదలైన వ్యాధులు ఉండకూడదు. ఒక వ్యక్తి 3 నెలల నుంచి 4 నెలలకోసారి రక్తదానం చేయోచ్చు. అయితే మనిషి రక్త గ్రూపులు ఎన్ని రకాలంటే.. ఏ, బీ, ఏబీ, ఓ బ్లడ్ గ్రూపులను ఠక్కున చెప్పేస్తారు. కానీ దీనికి తోడు చాలా అరుదైన బ్లడ్ గ్రూపులు ప్రపంచంలో ఉన్నాయని మీకు తెలుసా.? కేవలం ప్రపంచవ్యాప్తంగా 40మంది దగ్గర మాత్రమే ఈ కొన్ని అరుదైన రక్త గ్రూపులున్నాయి.

ఈ గ్రూపు పేరు రీసస్ నెగెటివ్ (RH Null). దీన్నే గోల్డెన్ బ్లడ్ గ్రూప్ గా పిలుస్తారు. అసలు రక్త గ్రూపులు ఎలా ఏర్పడుతాయో తెలుసా.? ఎవరి శరీరంలోనైనా యాంటిజెన్ తక్కువ మోతాదులో ఉంటే వారి బ్లడ్ గ్రూప్ ను అత్యంత అరుదైన గ్రూపుగా పరిగణిస్తారు. యాంటీజెన్ అనేది శరీరంలోని యాంటీబాడీలో తయారవుతుంది.

అది శరీరాన్ని వైరస్, బ్యాక్టీరియా ల నుంచి కాపాడుతుంది. ఎవరికైతే రీసస్ నెగెటివ్ బ్లడ్ గ్రూపు ఉంటుందో వారు తమ రక్తాన్ని దానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడగలరు. గడిచిన 52 సంవత్సరాల్లో కేవలం 43 మంది దగ్గర మాత్రమే ఇటువంటి బ్లడ్ గ్రూప్ ఉన్నట్టు వెల్లడైంది. రీసస్ నెగెటివ్ బ్లడ్ కలిగిన వారు ప్రపంచంలో ఎవరికైనా సరే రక్తదానం చేయగలుగుతారు.

ఈ అరుదైన బ్లడ్ గ్రూపు కలిగిన వారు సాధారణ మనుషుల్లానే ఉంటారు. అయితే వీరు తమపై తాము మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే వీరికి బ్లడ్ గ్రూప్ డోనర్ దొరకడం కష్టం.. ఏదైనా ప్రమాదమై రక్తం అవసరం పడితే చావడమే.. తక్కువమంది ఈ గ్రూపు వారు ఉండడంతో వారికోసం వెయిట్ చేసే వరకూ ప్రాణాలే పోతాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker