ముక్కులో నుంచి రక్తం కారుతోందా..? మీరు వెంటనే ఏం చెయ్యాలంటే..?
ముక్కు నుంచి రక్తస్రావం అనేది ఒక సాధారణ సమస్య. ప్రాథమిక చికిత్సతోనే దీన్ని నయం చేసుకోవచ్చు. ఇది కొద్దిగా రక్తపోటుని పెంచుతుంది. రక్తం చూడగానే ఆందోళన చెందకుండా ధైర్యంగా చికిత్స చేసుకుంటే సరిపోతుంది. విటమిన్ ఈ క్యాప్సూల్స్ లో ఉన్న ఆయిల్ ని ముక్కు లోపల దూది సహాయంతో అప్లై చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కూడా రక్తస్రావం ఆగుతుంది. అయితే ముక్కు నుంచి రక్తం కారడం వల్ల డిఫ్తీరియా లాంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది.
ముక్కులో ఎంతో సున్నితంగా ఉండే నాసికా పొరలు డ్రై అయినా కూడా ముక్కు నుంచి రక్తం కారుతుంది. అయితే కొన్ని వంటింటి చిట్కాలను పాటించడం ద్వారా ముక్కు నుంచి రక్తం కారే సమస్యకు చెక్ పెట్టవచ్చు. ముక్కు దగ్గర కత్తిరించిన ఉల్లిపాయను ఉంచితే కొంత సమయం తర్వాత రక్తం కారడం ఆగుతుంది. ముక్కు నుంచి రక్తం కారడాన్ని ఆపడంలో కొత్తిమీర సైతం సహాయపడుతుంది.
కొద్దిగా కొత్తిమీర రసాన్ని ముక్కులో వేసుకుంటే రక్తం కారడం ఆగడంతో పాటు ముక్కు పొరలు పగిలే సమస్యను కొత్తిమీర నివారిస్తుంది. ఒత్తిడికి గురయ్యే నరాలకు ఉపశమనం కలిగించడంలో తులసిరసం సహాయపడుతుంది. ముక్కులో రెండు చుక్కల తులసి రసాన్ని వేసినా మంచి ఫలితం ఉంటుంది. దూదిపై విటమిన్ ఇ ఆయిల్ వేసి ముక్కు పొరలకు రాసినా ముక్కు నుంచి రక్తం కారే సమస్యకు చెక్ పెట్టవచ్చు.
రోజూ విటమిన్ సి ఉన్న ఆహారం తీసుకున్నా ముక్కు రంధ్రాలు డ్రై కాకుండా తడిగా ఉంటాయి. రక్త నాళాలను చురుగ్గా ఉంచడానికి అవసరమైన జింక్, ఇతర పోషకాలు ఉండే బ్రెడ్స్, బ్రౌన్ రైస్‌లను ఆహారంగా తీసుకున్నా ముక్కు నుంచి రక్తం కారదు. శాస్త్రవేత్తలు ప్రతి మనిషి జీవితంలో కనీసం ఒక్కసారైనా ముక్కు నుంచి రక్తం కారుతుందని చెబుతున్నారు.