Health

మూత్రాశయ క్యాన్సర్‌ గురించి డాక్టర్ చెప్పిన కీలక విషయాలు ఇవే.

భారతదేశంలో ప్రబలంగా ఉన్న పదిహేడు రకాల క్యాన్సర్లలో ఇదీ ఒకటి. ఏటా 21,000 మందిలో మూత్రాశయ క్యాన్సర్‌ నిర్ధారణ జరుగుతున్నది. ఈ వ్యాధిగ్రస్తుల్లో దాదాపు 50 శాతం మృత్యువాత పడుతున్నారని అంచనా. స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో వ్యాధి తీవ్రత మూడు నుంచి నాలుగు రెట్లు అధికం. అయితే “యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ అనేది క్యాన్సర్ లోని అత్యంత సాధారణ రూపాలలో ఒకటి. దీనిని వైద్యభాషలో యురోథెలియల్ కార్సినోమా, ట్రాన్సిషనల్ సెల్ కార్సినోమా అని కూడా పిలుస్తారు, ఇది మూత్రాశయ క్యాన్సర్ అత్యంత ప్రబలమైన రకం.

గ్లోబోకాన్ విడుదల చేసిన డేటా ప్రకారం, భారతదేశంలో ప్రతి సంవత్సరం 21,000 కంటే ఎక్కువ మూత్రాశయ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. అలాగే ఈ బ్లాడర్ క్యాన్సర్ బారినపడి ప్రతి సంవత్సరం 11,000 పైగా జనం మరణిస్తున్నారు. ఈ క్యాన్సర్ రకానికి చికిత్స విజయవంతమైన తర్వాత కూడా ప్రారంభ దశ మూత్రాశయ క్యాన్సర్ పునరావృతమవుతుంది.

అందువల్ల, మూత్రాశయ క్యాన్సర్ కు సమర్థవంతమైన వ్యాధి నిర్వహణపై దృష్టి పెట్టడం అత్యవసరం, రోగులు క్రమం తప్పకుండా సంవత్సరాల పాటు పరీక్షలు చేసుకోవడం అవసరం ఉంటుంది” అని డాక్టర్ ప్రణవ్ అన్నారు. మూత్రాశయ క్యాన్సర్‌ ప్రమాద కారకాలు.. డాక్టర్ ప్రణవ్ ఛజెడ్ ప్రకారం, మూత్రాశయ క్యాన్సర్‌ సంభవించడానికి వివిధ ప్రమాద కారకాలు ఉన్నాయి. ఈ వ్యాధి రావడానికి ముఖ్య కారణాలు ఇలా ఉన్నాయి..ధూమపానం, పొగాకు వినియోగం.

ఊబకాయం, జీవనశైలి, రసాయనాలు, సుగంధ అమైన్‌లకు గురికావడం, పునరావృతమైన లేదా దీర్ఘకాలిక మూత్ర ఇన్ఫెక్షన్లు, అంతకుముందు మూత్రాశయ క్యాన్సర్‌కు చికిత్స తీసుకొని ఉండటం, కుటుంబ సభ్యుల్లో ఎవారికైనా ఈ వ్యాధి ఉండటం, వంశపారం పర్యంగా రావచ్చు. మూత్రాశయ క్యాన్సర్‌కు చికిత్స.. మూత్రాశయ క్యాన్సర్‌కు సమర్థవంతమైన చికిత్స కోసం, డాక్టర్ ప్రణవ్ ఈ కింది చికిత్సా విధానాలను సూచించారు..శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియోథెరపీ, ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ.

మూత్రాశయ క్యాన్సర్‌ నివారణ మార్గాలు.. ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడం, అధిక మొత్తంలో పండ్లు, కూరగాయలతో సమతుల్య ఆహారం తీసుకోవడం, మితంగా శారీరక వ్యాయామం చేయడం వంటివి చేయాలి. అలాగే, క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి ఆల్కహాల్, పొగాకు వినియోగానికి దూరంగా ఉండాలి, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. వైద్య నిపుణులతో రెగ్యులర్ గా సంప్రదించడం ద్వారా మూత్రాశయ క్యాన్సర్‌ను నివారించడం సాధ్యమవుతుంది అని వైద్యులు సూచిస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker