నల్ల ఉప్పును ఇలా చేసి తీసుకుంటే అలాంటి సమస్యలన్నీ మాయం.
నల్ల ఉప్పును హిమాలయన్ బ్లాక్ సాల్ట్, సులేమాణి నమక్, కాలా నమక్ ఇలా వివిధ రకాలుగా పిలుస్తారు. ఈ నల్ల ఉప్పు ప్రత్యేకమైన రుచి, వాసన కలిగి ఉండి ఆహారపదార్థాలకు మంచి రుచి, వాసనను అందిస్తుంది. సాధారణ ఉప్పుతో పోలిస్తే ఈ ఉప్పులో సోడియం శాతం తక్కువగా ఉంటుంది. అయితే నల్ల ఉప్పును ఆయుర్వేదంలో పలు అనారోగ్య సమస్యలను నయం చేసేందుకు ఔషధంగా ఉపయోగిస్తారు.
భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి నల్ల ఉప్పును వంటల్లో ఉపయోగిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు దీని వాడకం తక్కువైంది. అయితే నిజానికి నల్ల ఉప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. వాటితో మనం పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు.
వేసవిలో చాలా మంది శీతలపానీయాలను తాగుతుంటారు. వాటికి బదులుగా ఏదైనా పండ్ల రసం లేదా కొబ్బరి నీళ్లలో చిటికెడు నల్ల ఉప్పు కలిపి తాగితే శరీరం చల్లబడుతుంది. వేసవి తాపం నుంచి బయట పడవచ్చు. శరీరాన్ని చల్లబరిచే గుణం నల్ల ఉప్పుకు ఉంటుంది. మలబద్దకం సమస్య ఉన్నవారు నల్ల ఉప్పును రోజూ తీసుకుంటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.
గ్యాస్ సమస్యలతో బాధపడేవారు చిటికెడు నల్ల ఉప్పు తింటే ఉపశమనం కలుగుతుంది. కడుపులో మంట, అసిడిటీ, కడుపు ఉబ్బరం ఉన్నవారు, గుండెల్లో మంట ఉన్నవారు నల్ల ఉప్పు తింటే ఫలితం ఉంటుంది. వేసవిలో నల్ల ఉప్పును రోజూ వాడడం వల్ల శరీరానికి చల్లదనం లభిస్తుంది. వేడి చేయకుండా ఉంటుంది.