వీటిని తింటుంటే మధుమేహం, అల్జీమర్స్, క్యాన్సర్, గుండె సమస్యలు శాశ్వతంగా తగ్గిపోతాయి.
నల్ల ఎండుద్రాక్షలో ప్రోటీన్, పిండి పదార్థాలు, ఫైబర్, చక్కెర, కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ సి వంటి అనేక పోషకాలు ఉంటాయి. రక్తహీనత గుండె, బిపి, ఎముకలు, కడుపు, జుట్టు, చర్మానికి ఇది ఉపయోగపడుతుంది. జీర్ణ వ్యవస్థ నల్ల ఎండుద్రాక్షలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రోజూ తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థకు సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి. దీంతో పాటు, మలబద్ధకం సమస్యను కూడా తొలగిస్తుంది.
దీనివల్ల కడుపు బాగా శుభ్రం అవుతుంది. అయితే ఫంగస్, బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధుల నుంచి ఎండుద్రాక్షతో సులభంగా ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా ఇందులో శరీరానికి కావాల్సిన పాలీఫెనాల్స్, ఫైబర్, ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం వంటి అనేక పోషకాలు లభిస్తాయి. కాబట్టి ఆహారాల్లో ఎండు ద్రాక్షను వినియోగించడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఎండుద్రాక్షలో ఉండే పీచు పొట్ట సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా వినియోగిస్తే గ్యాస్, ఉబ్బరం, అపానవాయువు, మలబద్ధకం, అజీర్ణం వంటి అనేక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యలు కూడా తగ్గుతాయి. దీంతో శరీరం దృఢంగా తయారవుతుంది.
ఎండుద్రాక్ష మధుమేహం, అల్జీమర్స్, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. అయితే దీని కోసం ఎండు ద్రాక్షలను నీళ్లలో నానబెట్టి ఆ నీటిని తాగడం వల్ల శరీరం ఫిట్‌గా తయారవుతుంది. ఎండుద్రాక్ష నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల మలబద్ధం సమస్యలు సులభంగా నయమవుతాయి. అంతేకాకుండా పొట్ట సమస్యలు తగ్గిపోయి. శరీరం ఆరోగ్యవంతంగా తయారవుతుంది.
ముఖ్యంగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నవారికి ఔషధలా పని చేస్తుంది. ఎండుద్రాక్షలో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి ఇవి చర్మాన్ని మెరుగుపరుస్తాయి. ఎండుద్రాక్షలో శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడే మూలకాలుంటాయి. కాబట్టి వీటిని పాలతో వేడి చేసి.. పాలను తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే క్యాల్షియం ఎముకలను దృఢపరుస్తుంది.