News

మీకు చేతబడి జరిగిందని అనుమానం ఉందా..! ఈ లక్షణాలు ఒకసారి చెక్ చేసుకోండి.

గిట్టని వారిని చంపటానికో, హానిచేయడానికో చేసే/చేయించే విద్యని చేతబడి అంటారు.వివిధ ప్రాంతాలను బట్టి దీనిని విచ్ క్రాఫ్ట్, వూడూ, బ్లాక్ మ్యాజిక్, సిహ్ర్, బాణామతి, చిల్లంగి అని కూడా అంటారు. ఇది పగ తీర్చుకోటానికి ప్రయోగించే మరో దుర్మార్గం. దీని ప్రభావం వల్లనే నష్టం జరిగిందని భావించి పగలు తీర్చుకొంటున్నారు. అయితే ఇప్పటికీ చాలా గ్రామాల్లో నరబలులు, నాలుగు రోడ్ల వద్ద కుంకుమ,పసుపు, నిమ్మకాయ, కోడిగుడ్లు లాంటివి పెట్టడం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా చాలా గ్రామాల్లో చేతబడి చేస్తున్నారని నేపంతో కొట్లాటలు కూడా చూస్తూ ఉన్నాం.

అలాంటి ఈ తరుణంలో చాలామంది ప్రజలు చేతబడి గురించి భయపడుతూ ఉంటారు. చేతబడి నిజంగానే ఉందా? లేదా? అనేది ఇప్పటివరకు ఎవరు కూడా తేల్చలేకపోతున్నారు. సైంటిస్టులను అడిగితే చేతబడి లేదు అంటారు, అదే పండితులను అడిగితే చేతబడి, దైవభక్తి అన్ని ఉన్నాయి అంటారు. దేవుడు ఉన్న దగ్గర చేతబడి కూడా ఉంటుందని చాలా సినిమాల్లో చూపిస్తున్నారు. మాట్లాడుకోవడం:- ఒక వ్యక్తి పై చేతబడి జరిగినట్లయితే, రాత్రిపూట అస్సలు నిద్ర పట్టదట. అంతేకాకుండా రాత్రిపూట తనకు తానే మాట్లాడుకుంటూ ఉంటారట.

అలాగే రాత్రి కలలో భయంకరమైనటువంటి ప్రమాదాలు కనిపించడం, అనారోగ్యం క్షీణించడం వంటివి జరుగుతాయట. అమావాస్య:- చేతబడికి గురైనటువంటి వ్యక్తి తప్పనిసరిగా అమావాస్య రోజు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటారట. అమావాస్య, పౌర్ణమి వచ్చింది అంటే చాలు వారి శరీరంలో మార్పులు వచ్చి గట్టిగ అరవడం, ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా వినకపోవడం, బయట పరిగెత్తడము, ఇంట్లో వాళ్ళను కూడా కొట్టడం, తిట్టడం లాంటివి చేస్తూ ఉంటారట. ఈ సమయంలో వారు ఎంతమంది ఆపిన వారిని తప్పించుకొని పరిగెత్తే శక్తి వస్తుందట.

అందవిహీనం :- చేతబడి జరిగినటువంటి వ్యక్తి శరీరంలో అనేక మార్పులు కనిపిస్తాయట. చేతబడి జరిగినట్లయితే అందంగా ఉన్నటువంటి స్త్రీ లేదా పురుషుడు అంద విహీనంగా తయారు కావడం, కాస్త బలంగా ఉన్న వ్యక్తులు బక్క పల్చగా అవ్వడం, ఫేస్ పై అనేక మార్పులు కనిపిస్తాయట. ఒంటరిగా ఉండడం:- చేతబడి ప్రయోగం ఒక వ్యక్తి పై జరిగితే తనలో తాను మాట్లాడుకోవడమే కాకుండా, ఒంటరిగా ఉంటారట. చీకటి గదిలో జీవిస్తారట.

అంతేకాకుండా రాత్రిపూట బయట తిరుగుతూ ఉంటారట. ఈ కారణం లేకుండానే ఏడవడం నవ్వడం లాంటివి కూడా చేస్తూ ఉంటారట. భార్యా భర్తల గొడవలు:-చేతబడి ప్రయోగం అనేది పెళ్లయిన వ్యక్తులపై జరిగితే భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, భర్త లేదా భార్య ఇతర వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడం వంటివి చేస్తారట. కుటుంబం గురించి పట్టించుకోకపోవడం, ఎవరు ఏమనుకున్నా వారికి నచ్చినట్టు బిహేవ్ చేయడం లాంటివి చేస్తారట.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker