నల్ల కిస్ మిస్ వాటర్ ని ఆడవాళ్లు గుర్తుపెట్టుకొని మరి తాగాలి, వంధ్యత్వం, గర్భం దాల్చడంలో..!
నల్ల ద్రాక్షలను ఎండబెట్టి వీటిని తయారు చేస్తారు. సాధారణ కిస్మిస్‌లతో పోలిస్తే ఈ కిస్మిస్‌లు ఎన్నో ఔషధ గుణాలను దాగి ఉంటాయి. ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. నల్ల కిస్మిస్ లు తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని పలు పరిశోధనల్లో తేలింది. అయితే ఎండుద్రాక్షలను కిస్ మిస్ లు అని కూడా అంటారు. ఇవి టేస్టీగా ఉండటమే కాదు మన ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. ఎర్ర ఎండుద్రాక్షల మాదిరిగానే నల్ల ఎండుద్రాక్షలు కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి. ఈ కిస్ మిస్ లను నీటిని నానబెట్టి తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. నల్ల ఎండుద్రాక్ష నీరు ఎందుకంత ప్రత్యేకం..
నల్ల ఎండుద్రాక్షలను రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు వడకట్టి తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. నానబెట్టడం ఎండుద్రాక్షల్లోని అన్ని విటమిన్లు, ఖనిజాలను నీటిలోకి వస్తాయి. అంతేకాదు వీటిలోని చక్కెర కూడా పరిమితం అవుతుంది. ఈ ప్రక్రియ కేవలం మన శరీరానికే కాదు జుట్టు పెరుగుదలకు, చర్మానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ వాటర్ వల్ల కలిగే ప్రయోజనాలు.. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఈ నల్ల ఎండుద్రాక్ష వాటర్ లో రాగి, ఇనుము, ఎన్నో రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ వాటర్ మన ఎర్ర రక్త కణాలను పెంచుతుంది. ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. అంతేకాదు ఈ వాటర్ బ్లడ్ ప్యూరిఫైయర్ గా కూడా పని చేస్తుంది.
ఇది పీసీఓఎస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీరియడ్స్ సమయంలో రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది రక్తహీనతను నివారించడానికి కూడా సహాయపడుతుంది. ఈ వాటర్ ను రెగ్యులర్ గా తాగితే రక్తహీనత సమస్య తగ్గుతుంది. అలాగే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. నల్ల ఎండుద్రాక్షలో అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అమైనో ఆమ్లాలు కూడా గర్భం దాల్చే అవకాశాలను పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే ఎల్-అర్జినిన్ గర్భాశయం, అండాశయాల్లో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.
శృంగారానికి రెండు మూడు గంటల ముందు ఈ వాటర్ ను తాగితే మీ సెక్స్ కోరికలు పెరుగుతాయి. ఇది కామోద్దీపనగా కూడా పనిచేస్తుంది. నల్ల ఎండుద్రాక్ష చర్మానికి ప్రయోజనాలు..నల్ల ఎండు ద్రాక్షలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీని నిర్విషీకరణ, యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మాన్ని అందంగా, కాంతివంతంగా చేస్తాయి. అలాగే బిగుతుగా చేస్తాయి. వీటిలో ఉండే విటమిన్ సి మొటిమలను తగ్గించడానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా ఈ వాటర్ ను తాగడం వల్ల మొటిమలు తగ్గిపోతాయి. ఇందుకోసం 8-10 ఎండుద్రాక్షలను తీసుకుని ఒక కప్పు నీటిలో నానబెట్టి ఉదయం పరిగడుపున తాగండి.
సంతానోత్పత్తి కోసం నల్ల ఎండుద్రాక్ష నీటిని ఎలా తాగాలి? హార్మోన్ల అసమతుల్యత వల్ల వంధ్యత్వం సమస్య వస్తుంది. 150 గ్రాముల నాణ్యమైన నల్ల ఎండుద్రాక్ష తీసుకుంటే సంతానోత్పత్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 150 గ్రాముల నల్ల ఎండుద్రాక్షలో 2 కప్పుల నీళ్లు పోయాలి. మూతపెట్టి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు వడకట్టాలి. ఎండుద్రాక్షను చూర్ణం చేసి, దాని రసాన్ని నీటి నుంచి వేరుచేసి తాగాలి. గర్భధారణ సమయంలో నల్ల ఎండుద్రాక్షలు నానబెట్టిన నీటిని తాగితే మలబద్దకం సమస్య తగ్గుతుంది. ఇది పేగు కదలికలను.